Ranbir Kapoor, Rashmika Mandanna in New 7UP Ad 2024: బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్, కన్నడ సోయగం రష్మిక మందన్నాలు బ్లాక్ బస్టర్ మూవీ ‘యానిమల్’లో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై సూపర్ హిట్ ఫెయిర్‌గా రణ్‌బీర్-రష్మిక నిలిచారు. ఈ ఇద్దరు యానిమల్ సీక్వెల్‌లో కూడా కనిపించబోతున్నారు. అయితే రణ్‌బీర్, రష్మిక మరోసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే ఇద్దరూ కనిపించేది సినిమాలో కాదు.. ఓ కమర్షియల్ యాడ్ కోసం జతకట్టారు.
సాఫ్ట్ డ్రింక్ ‘సెవెన్ అప్’ యాడ్‌లో రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నాలు కలిసి నటించారు. ఇద్దరూ క్లాసీ లుక్‌లో కనిపిస్తూ యాడ్‌లో సందడి చేస్తున్నారు. సెవెన్ అప్ యాడ్‌కు సంభదించిన రెండు వేర్వేరు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘ఖండాలా వాటర్ ఫాల్’ ఎక్కడ అని రష్మిక అడగ్గా.. రణ్‌బీర్ సెవెన్ అప్ బాటిల్ ఇస్తాడు. రష్మిక సెవెన్ అప్ తాగగానే వర్షం కురుస్తుంది. మరో యాడ్ వీడియో కూడా ఇలానే ఉంటుంది.
Also Read: Rishabh Pant: రిషబ్ పంత్ నుంచి ప్రేరణ పొందలేని వారు.. మనుషులే కాదు!
సందీప్‌రెడ్డి వంగా, రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా ప్రస్తుతం తమ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. బ్రహ్మాస్ర ప్రాంఛైజీలో రణ్‌బీర్ నటించాల్సి ఉంది. రష్మిక ప్రస్తుతం ది గర్ల్ ఫ్రెండ్, పుష్ప ది రూల్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. దాంతో యానిమల్ పార్క్ ప్రిన్సిపల్ ఫొటోగ్రఫీ 2026లో షురూ కానుందని తెలుస్తోంది.