Ranbir Kapoor : సినిమాలకు బ్రేక్ ప్రకటించిన బాలీవుడ్ స్టార్ హీరో.. కారణం అదేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ తాజాగా అభిమానులకు షాకింగ్ న్యూస్ తెలిపారు.. సినిమాలకు కాస్త బ్రేక్ తీసుకుంటున్నట్లు ప్రకటించారు.అయితే ఆయన కేవలం ఆరు నెలలు మాత్రమే బ్రేక్ తీసుకోనున్నట్టు తెలిపారు. రణ్‌బీర్ బ్రేక్ తీసుకోవడానికి కారణం తన కూతురు రాహా అని తెలుస్తుంది.. హీరోయిన్ అలియాభట్, రణ్‌బీర్ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. గతేడాది ఏప్రిల్‌లో వీరి వివాహం జరిగింది. వీరికి నవంబర్ 6న పాప రాహా జన్మించింది. ఆ చిన్నారి జన్మించి ఏడాది కావస్తుందడంతో తనతో ఆడుకోవడానికి టైమ్ దొరకడం లేదట. తన బిజీ షెడ్యూల్ కారణంగా పాపతో టైమ్ స్పెండ్ చేయాలకపోతున్నారట రణ్‌బీర్. అందుకే సినిమాలకు బ్రేక్ తీసుకుంటున్నట్టు ప్రకటించారు.
తాజాగా ఆయన మాట్లాడుతూ, చాలా రోజులుగా నా కూతురు రాహాతో టైమ్ స్పెండ్ చేయాలనుకుంటున్నా, కానీ అస్సలు కుదరడం లేదు, సినిమాలకు సంబంధించిన బిజీ షెడ్యూల్ కారణంగా తనతో సమయం గడపలేకపోయాను. అందుకే ఇప్పుడు ఆరు నెలలు రాహాతోనే ఉండాలనుకుంటున్నా. `యానిమల్` చిత్రం తర్వాత మరో సినిమాకి సైన్ చేయలేదు. రాహా ఇప్పుడిప్పుడే అన్నింటిని గుర్తిస్తుంది. మాకు ప్రేమని పంచుతుంది. మాట్లాడానికి కూడా ప్రయత్నిస్తుంది. ఈ అందమైన, మధురమైన క్షణాలను నేను ఆస్వాదించాలనుకుంటున్నా. అందుకే ఆరు నెలలు పూర్తిగా తనతోనే స్పెండ్ చేస్తాను` అని తెలిపారు. ప్రస్తుతం రణ్ బీర్ కపూర్.. `యానిమల్` చిత్రంలో నటిస్తున్నారు. సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రం డిసెంబర్ 1న గ్రాండ్ గా విడుదల కాబోతుంది. గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఇప్పటికే విడుదలై ఎంతగానో ఆకట్టుకుంది.ఈ సినిమాలో రణ్ బీర్ రగ్గడ్ లుక్ లో ఎంతో వైలెంట్ క్యారెక్టర్ లో నటించారు. అలాగే హీరో హీరోయిన్ ల పై రొమాంటిక్ సీన్స్ కూడా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా స్పెషల్ గా తెరకెక్కించారు…
Also Read
- Trump vs Media: వార్తా సంస్థలను ‘కేన్సర్’తో పోల్చిన ట్రంప్.. కోర్టుకెళ్లనున్న మీడియా సంస్థలు
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- Ponguleti: పేదోడి ఆత్మగౌరవమే ఇందిరమ్మ టవర్స్ లక్ష్యం
- Gummanur Jayaram: ‘రెబల్‌గా వేస్తే సినిమా చూపిస్తా..!’.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే గుమ్మనూరు సీరియస్ వార్నింగ్..
తాజావార్తలు
-
Mandadi: కమెడియన్ అనుకుంటే స్టార్ హీరోల కటౌట్లే షేక్ చేశాడు! రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘మందాడి’..
-
Kartikeya Gummakonda : తన ‘కమ్‌బ్యాక్’ కోసం మెగాఫోన్ పట్టిన ‘ఆర్ఎక్స్ 100’ హీరో..
-
Trump vs Media: వార్తా సంస్థలను ‘కేన్సర్’తో పోల్చిన ట్రంప్.. కోర్టుకెళ్లనున్న మీడియా సంస్థలు
-
CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
-
Ponguleti: పేదోడి ఆత్మగౌరవమే ఇందిరమ్మ టవర్స్ లక్ష్యం
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!