NTV Telugu Site icon

Ghaati : అనుష్క ‘ఘాటీ’ మూవీలో గెస్ట్ రోల్ చేస్తున్న రానా ?

New Project (91)

New Project (91)

Ghaati : అనుష్క శెట్టి తన ముద్దు పేరు స్వీటి. ఈ పేరుతో పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. కెరీర్ మొదట్లో గ్లామర్ డాల్ ఇమేజ్ సొంతం చేసుకుంది. అరుంధతి సినిమా తర్వాత తను పంథా మార్చుకుంది. ప్రస్తుతం డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడితో ‘ఘాటి’ అనే సినిమా చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ చిత్రం ‘వేదం’ తర్వాత అనుష్క, క్రిష్ కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై అనుష్క నాలుగో సినిమా చేస్తుంది. అనుష్క బర్త్ డే సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన ఫస్ట్ లుక్ అదిరిపోయిందనే చెప్పాలి. ఇందులో అనుష్క పాత్ర స్టన్నింగ్ అండ్ రూత్ లెస్ అవతార్‌ను ప్రజెంట్ చేసింది. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.

Read Also:Ponnam Prabhakar: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలకు వార్నింగ్.. అలా చేస్తే బస్సులు సీజ్

ఇప్పటికే దాదాపు షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలైంది. ఇక వచ్చే షెడ్యూల్ లో ఈ సినిమా క్లైమాక్స్ ను షూట్ చేయడానికి సన్నాహాలు చేసున్నారు దర్శకుడు క్రిష్. ఈ క్లైమాక్స్ షూట్ ను జనవరి చివరలో తీసే అవకాశం ఉంది. కాగా ప్రస్తుతం అనుష్క మలయాళంలో ఓ సినిమా చేస్తుంది. ఆ సినిమాతో పాటు ఘాటీ సినిమాలో మాత్రమే అనుష్క నటిస్తోంది. క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ తో అంచనాలు పెంచేశారు. అనుష్క లోని మాస్ యాంగిల్ ని మరోసారి ఆవిష్కరించనున్నారు డైరెక్టర్ క్రిష్.

Read Also:Mohan Bhagwat: బెంగాల్‌లో మోహన్ భగవత్ 10 రోజుల పర్యటన.. కీలక పరిణామాలుంటాయని చర్చ!

అనుష్క చేసిన అరుంధతి, రుద్రమదేవి సినిమాల మాదిరి అనుష్కకు క్రేజ్ తెచ్చేలా ఈ సినిమా ఉందని చెబుతున్నారు. ఘాటి సినిమాను ఏప్రిల్ 18న రిలీజ్ లాక్ చేశారు. అసలైతే ఆ టైం లో ప్రభాస్ రాజా సాబ్ రిలీజ్ అనుకున్నారు కానీ ఆ సినిమా వాయిదా పడుతుందని తెలిసి ఘాటిని వదులుతున్నారు. అయితే ‘ఘాటీ’లో మరో గెస్ట్ రోల్ ఉంటుందని ఆ పాత్రలో ఓ హీరో నటిస్తున్నాడని ఆ మధ్య వార్తలు వైరల్ అయ్యాయి. కాగా తాజాగా వినిపిస్తున్న అప్ డేట్ ప్రకారం ఆ పాత్రలో రానా కనిపిస్తున్నాడని టాక్ నడుస్తోంది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో చూడాలి. ఘాటి సినిమాను కేవలం తెలుగులో కాకుండా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Show comments