Ghaati : అనుష్క ‘ఘాటీ’ మూవీలో గెస్ట్ రోల్ చేస్తున్న రానా ?
- ‘ఘాటీ’ మూవీలో గెస్ట్ రోల్ చేస్తున్న రానా
- పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అవుతున్న మూవీ
- ప్రమోషన్లకు సాయం చేయనున్న ప్రభాస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ghaati : అనుష్క శెట్టి తన ముద్దు పేరు స్వీటి. ఈ పేరుతో పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. కెరీర్ మొదట్లో గ్లామర్ డాల్ ఇమేజ్ సొంతం చేసుకుంది. అరుంధతి సినిమా తర్వాత తను పంథా మార్చుకుంది. ప్రస్తుతం డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడితో ‘ఘాటి’ అనే సినిమా చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ చిత్రం ‘వేదం’ తర్వాత అనుష్క, క్రిష్ కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై అనుష్క నాలుగో సినిమా చేస్తుంది. అనుష్క బర్త్ డే సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన ఫస్ట్ లుక్ అదిరిపోయిందనే చెప్పాలి. ఇందులో అనుష్క పాత్ర స్టన్నింగ్ అండ్ రూత్ లెస్ అవతార్‌ను ప్రజెంట్ చేసింది. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.
Read Also:Ponnam Prabhakar: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలకు వార్నింగ్.. అలా చేస్తే బస్సులు సీజ్
Also Read
- Vijayawada Durga Temple: దుర్గమ్మ భక్తులకు గుడ్‌న్యూస్.. ఇక ఓటీపీ ఎంటర్ చేస్తే చేతికి దుర్గమ్మ లడ్డూ
- Vaibhav Sooryavanshi-Brett Lee: అవును, వైభవ్ సూర్యవంశీ వయసు 18 ఏళ్లు అయినా ఎవరికి నష్టం?
- Lal Darwaza Bonalu: పాతబస్తీలో బోనాల పండుగ శోభ.. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
- Ravindra Jadeja: ఎట్టకేలకు గంభీర్ ముఖంలో నవ్వులు పూయించిన జడేజా.. ఏం చేశాడో చూడండి (వీడియో)
ఇప్పటికే దాదాపు షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలైంది. ఇక వచ్చే షెడ్యూల్ లో ఈ సినిమా క్లైమాక్స్ ను షూట్ చేయడానికి సన్నాహాలు చేసున్నారు దర్శకుడు క్రిష్. ఈ క్లైమాక్స్ షూట్ ను జనవరి చివరలో తీసే అవకాశం ఉంది. కాగా ప్రస్తుతం అనుష్క మలయాళంలో ఓ సినిమా చేస్తుంది. ఆ సినిమాతో పాటు ఘాటీ సినిమాలో మాత్రమే అనుష్క నటిస్తోంది. క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ తో అంచనాలు పెంచేశారు. అనుష్క లోని మాస్ యాంగిల్ ని మరోసారి ఆవిష్కరించనున్నారు డైరెక్టర్ క్రిష్.
Read Also:Mohan Bhagwat: బెంగాల్లో మోహన్ భగవత్ 10 రోజుల పర్యటన.. కీలక పరిణామాలుంటాయని చర్చ!
అనుష్క చేసిన అరుంధతి, రుద్రమదేవి సినిమాల మాదిరి అనుష్కకు క్రేజ్ తెచ్చేలా ఈ సినిమా ఉందని చెబుతున్నారు. ఘాటి సినిమాను ఏప్రిల్ 18న రిలీజ్ లాక్ చేశారు. అసలైతే ఆ టైం లో ప్రభాస్ రాజా సాబ్ రిలీజ్ అనుకున్నారు కానీ ఆ సినిమా వాయిదా పడుతుందని తెలిసి ఘాటిని వదులుతున్నారు. అయితే ‘ఘాటీ’లో మరో గెస్ట్ రోల్ ఉంటుందని ఆ పాత్రలో ఓ హీరో నటిస్తున్నాడని ఆ మధ్య వార్తలు వైరల్ అయ్యాయి. కాగా తాజాగా వినిపిస్తున్న అప్ డేట్ ప్రకారం ఆ పాత్రలో రానా కనిపిస్తున్నాడని టాక్ నడుస్తోంది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో చూడాలి. ఘాటి సినిమాను కేవలం తెలుగులో కాకుండా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Vijayawada Durga Temple: దుర్గమ్మ భక్తులకు గుడ్‌న్యూస్.. ఇక ఓటీపీ ఎంటర్ చేస్తే చేతికి దుర్గమ్మ లడ్డూ
-
Himanshi Khurana Murder: కెనడాలో భారత సంతతికి చెందిన యువతి హ*త్య కేసులో కీలక పరిణామం.. 7 నెలల తర్వాత నిందితుడి అరెస్ట్
-
Adnan Sami: ఆరు నెలలే బ్రతుకుతానన్నారు.. తండ్రికిచ్చిన మాటకోసం 110 కిలోలు తగ్గినా: అద్నాన్ సమి
-
TVS Apache RTR 160 Price Hike: టీవీఎస్ Apache RTR 160 ధర పెంపు.. 2V, 4V కొత్త ధరలు, పూర్తి వివరాలు ఇవే!
-
World Tribal Day 2026: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం.. గిరిజనులకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!