Site icon NTV Telugu

Rana Naidu 2: ‘రానా నాయుడు 2’ అప్‌డేట్‌ ఇచ్చిన నెట్‌ఫ్లిక్స్‌!

Rana Naidu 2 Update

Rana Naidu 2 Update

Rana Naidu Season 2 Update: రానా దగ్గుబాటి, విక్టరీ వెంకటేశ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్‌ ‘రానా నాయుడు’. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా గతేడాది విడుదలైన ఈ సిరీస్‌ బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని అందుకుంది. అయితే ఫామిలీ ఇమేజ్ ఉన్న వెంకటేశ్‌.. మొదటిసారిగా బోల్డ్ కంటెంట్‌తో రావడంతో ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. బూతు సిరీస్ అని కూడా నెటిజెన్స్ కామెంట్స్ చేశారు. ఇవేమీ పట్టించుకోని రానా, వెంకటేశ్‌లు అప్పుడే సీక్వెల్‌ను ప్రకటించారు. తాజాగా సిరీస్‌కు సంబందించి నెట్‌ఫ్లిక్స్‌ అప్‌డేట్‌ ఇచ్చింది.

Also Read: Narsapuram MPDO: అదృశ్యమైన నర్సాపురం ఎంపీడీవో మృతి!

రానా నాయుడు సీజన్‌ 2 షూటింగ్‌ ప్రారంభమైనట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. షూటింగ్ జరుగుతోన్న ఓ వీడియోను షేర్‌ చేసింది. అందులో రానా, వెంకటేశ్‌ల మధ్య యాక్షన్‌ సన్నివేశాలు జరుగుతున్నట్లు చూపించారు. రానా నాయుడు సీజన్‌ 2 త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానున్నట్లు తెలుస్తోంది. మరెన్నో ట్విస్టులు, మరింత ఫ్యామిలీ డ్రామాతో సీజన్‌ 2 విడుదల చేస్తామని గతంలో నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. రానా నాయుడులో రెచ్చిపోయిన బాబాయ్, అబ్బాయిలు ఈసారి ఏ రేంజ్‌లో విజృంభిస్తారో చూడాలి.

Exit mobile version