Site icon NTV Telugu

Rana Daggubati: ఇండిగో ఎయిర్ లైన్స్ అంటేనే భగ్గుమంటున్న రానా దగ్గుబాటి

Rana

Rana

Rana Daggubati: ఇండిగో ఎయిర్ లైన్స్ పై భళ్లాలదేవుడు భగ్గుమంటున్నాడు. ఆ సంస్థ అందిస్తోన్న సేవల పై దగ్గుబాటి రాణా తీవ్ర విమర్శలు చేశారు. అసలేం జరిగిందంటే… ఈ ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి రానా హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లేందుకు ఎయిర్ పోర్టుకు వెళ్లారు. షెడ్యూల్డ్ ఫ్లయిట్ కాకుండా మరో విమానంలో వెళ్లాలని సిబ్బంది రానాకు సూచించారు. లగేజి కూడా అదే విమానంలో వస్తుందని తెలిపారు. వారు చెప్పినట్టే రానా కుటుంబం బెంగళూరు వెళ్లింది. కానీ లగేజి మాత్రం రాలేదు. దాంతో రానా ఆగ్రహం వ్యక్తం చేశారు. తన లగేజ్‌ మిస్‌ అయిందని, సిబ్బంది దాన్ని వెతికి పట్టుకోలేకపోయారంటూ ఆగ్రహించారు.

Read Also: Vladimir Putin: ఇంట్లో మెట్లపై నుంచి పడిపోయిన పుతిన్‌

ఇండిగో ఎయిర్ లైన్స్ వల్ల అత్యంత చెత్త అనుభవం ఎదురైందంటూ ట్విటర్‌ వేదికగా తన అసహనాన్ని వ్యక్త పరిచారు. ‘ఇండిగో విమాన సేవలు సరిగా లేవు. మిస్సైన లగేజ్‌ ట్రాకింగ్‌ కూడా సరిగా లేదు. ప్రయాణికుల లగేజ్ ఎక్కడ ఉందని ప్రశ్నిస్తే ఎలాంటి సమాధానం ఉండదు. ఇక్కడి సిబ్బందికి కూడా సరైన సమాచారం ఉండదు’అని రానా ట్వీట్‌ చేశాడు. విమానాలు ఎప్పుడొస్తాయో, ఎప్పుడు వెళతాయో తెలియదు… మిస్సయిన లగేజిని ఎలా కనుగొనాలో తెలియదు, ఈ విషయాలు సిబ్బందికే తెలియదు అంటూ సెటైర్లు వేశారు. అంతేకాదు, ఇండిగో ఎయిర్ లైన్స్ ప్రచార పోస్టులపైనా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ నేపథ్యంలో, సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా రానాకు మద్దతు ప్రకటించారు. గతంలో తమకు విమాన ప్రయాణాల్లో ఎదురైన అనుభవాలను వారు రానాతో పంచుకున్నారు.

Exit mobile version