NTV Telugu Site icon

Rana : రాజమౌళి – మహేష్ కాంబోలో రానా విలన్.. ఇక తెరలు చిరగాల్సిందే

New Project 2024 10 14t075457.489

New Project 2024 10 14t075457.489

Rana : తెలుగు చిత్రపరిశ్రమలో ఎలాంటి పాత్రలనైనా అవలీలగా పోషించగల నటుల్లో రానా దగ్గుబాటి ఒకరు. అందుకే పాన్ ఇండియాలో అన్ని భాషల్లో సినిమాలు చేయగలుగుతున్నారు. భాషతో సంబంధం లేకుండా పాత్ర నచ్చితే ఎంత వరకైనా వెళ్లే నటుడు రానా. అయితే ఎలాంటి పాత్రలు చేసినా.. హీరోగా చేసినా విలన్ పాత్రల ద్వారా ఆయనకు లభించే గుర్తింపు చాలా ప్రత్యేకం. అందుకే బాహుబలి సినిమాలో భల్లాల దేవగా ప్రపంచాన్ని మెప్పించగలిగాడు. భల్లాల దేవా లాంటి పాత్రలు చేయాల్సి వస్తే రానా మాత్రమే సరిపోతాడనే ముద్ర ఏర్పాటు చేసుకున్నాడు. ఇటీవల విడుదలైన రజినీకాంత్ వెట్టయాన్ సినిమాలో విలన్ గా నటించి ఆకట్టుకున్నారు. అందులో రానా పెర్ఫార్మెన్స్ చాలా ప్రొఫెషనల్ గా ఉంది. తెరపై కాసేపు కనిపించినా సినిమాను ఓ రేంజ్ కు తీసుకెళ్లే సినిమా అది. ఓ ఊపు తెచ్చిన పాత్ర అది. రానాని ఆ పాత్రలో చూసిన తర్వాత ఆయన హీరోగా కంటే ఇలాంటి పాత్రలతోనే ప్రేక్షకులకు మరింత దగ్గరవుతాడన్న నమ్మకం రెట్టింపు అయ్యింది. సరిగ్గా ఈ సమయంలోనే రానాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం లీక్ అయింది. SSMB 29లో విలన్‌గా రానా కన్ఫాం అయినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో ఓ వార్త హల్ చల్ చేస్తుంది.

Read Also: AP Liquor Policy: ఏపీలో మద్యం షాపులకు లాటరీ ప్రక్రియ ప్రారంభం.. వారిలో ఉత్కంఠ..!

ఇందులో రానా ఆఫ్రికాలోని మాసాయి తెగకు చెందిన కీలక పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. రాజమౌళి కోరిక మేరకే రానా ఇందులో నటిస్తున్నాడని అంటున్నారు. అతని పాత్ర చాలా రఫ్ గా ఉండబోతుంది. ఆయన గెటప్‌తో సహా అన్నీ కొత్త లుక్‌లో హైలైట్‌గా ఉంటాయని లీకులు చెబుతున్నాయి. రాజమౌళి నిర్వహించే వర్క్‌షాప్‌లకు కూడా రానా హాజరవుతున్నాడని సన్నిహిత వర్గాల సమాచారం. మరి ఇందులో ఎంత నిజముందో త్వరలోనే తెలుస్తుంది. రానాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు రావడానికి రాజమౌళి కారణమన్న సంగతి తెలిసిందే. అది భల్లాల దేవ పాత్రతోనే సాధ్యమైంది. ఆ తర్వాత రాజమౌళి ఆర్ఆర్ఆర్ చేశాడు. కానీ రానాకు అవకాశం ఇవ్వలేదు. అయితే ఇప్పుడు మళ్లీ అవసరం దృష్ట్యా రానాను తెరపైకి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.

Read Also:Surya : ‘కంగువ’ ఆడియో రీలీజ్ కు ముఖ్య అతిధిగా స్టార్ హీరో..?

Show comments