Ayodhya: ఈ నెల 22న అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరుగబోతుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. అయితే, ఇవాళ్టి నుంచి అయోధ్యలో రామోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి. మార్చి 24 వరకు జరిగే ఈ రామోత్సవాలలో మన దేశానికి చెందిన కళాకారులతో పాటు ప్రపంచం నలుమూల నుంచి వచ్చే 35 వేలకు పైగా కళాకారులు పాల్గొనబోతున్నారు. నేటి నుంచి రామ కథా పార్కులో రామకథ స్టార్ట్ అవుతుంది. అలాగే, ఇవాళ్టి నుంచి అయోధ్యలోని సరయూ నది ఒడ్డున హారతి కార్యక్రమం సైతం నిర్వహించనున్నారు. ఈ సమయంలో కళాకారులు తమ కళా ప్రతిభను ప్రదర్శిస్తారు.
Read Also: Bhatti Vikramarka: విప్లవానికి నాంది పలికిన ఆయనే నాకు స్పూర్తి.. తాజ్ కృష్ణలో భట్టి..!
కాగా, అయోధ్యలో త్వరలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ జరగనున్న సందర్భంగా దేశంలోని ఇతర ప్రాంతాలలో కూడా ప్రజలు రామభక్తిలో మునిగిపోతున్నారు. త్వరలో అహ్మదాబాద్‌లో జరిగే కైట్ ఫెస్టివల్‌లో కూడా రామ నామం జపించనున్నారు. దీంతో ఆ శ్రీ రాముడిని చిత్రాలతో కూడిన గాలి పటాలు తయారు చేసి.. ఆకాశంలో ఎగుర వేస్తేందుకు రెడీ అవుతున్నారు. ఇక, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ స్వయంగా రాముని చిత్రపఠంతో కూడిన గాలిపటాన్ని ఎగురవేయబోతున్నారు.