NTV Telugu Site icon

Rammandir Security: క్లీనింగ్ సమయంలో AK-47 మిస్ ఫైర్.. భద్రతా అధికారికి ప్రమాదం..!

8

8

అయోధ్యనగరంలోని రామ మందిరంలో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. మంగళవారం నాడు రామ జన్మభూమి కాంప్లెక్స్ లో ఉన్న ప్రొఫెషనల్ ఆర్మ్డ్ కానిస్టేబుల్ పై అనుమానాస్పద స్థితిలో కాల్పులు జరిగాయి. అతని ఛాతికి బుల్లెట్టు తగలడంతో ఆయనను చికిత్స కొరకు లక్నోలోని ట్రామా సెంటర్ హాస్పిటల్ కు తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న అయోధ్య రేంజ్ ఐజి ప్రవీణ్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని అక్కడి పరిస్థితులను అంచనా వేశారు.

Also read: Costly Cow: దేవుడా.. వేలంలో 40 కోట్లకు అమ్ముడుపోయిన నెల్లూరు ఆవు..!

అయితే ఈ కాల్పులు వేరొకరు జరిపారా.. లేకపోతే తుపాకీ మిస్ ఫైరింగ్ వల్ల జరిగిందా అన్న విషయంపై మొదటగా దర్యాప్తు చేపట్టారు. కాల్పులు జరిగిన సమయంలో సెక్యూరిటీ గార్డ్ రామ జన్మభూమి కాంప్లెక్స్ లో ఉన్న వాచ్ టవర్ పై ఉన్నాడు. ఈ విషయం సంబంధించి పోలీసు అధికారులు విచారణకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ సంఘటనలో కమాండో తన ఆయుధాన్ని శుభ్రం చేస్తున్న సమయంలో గాయపడినట్లు ఆ తర్వాత నిర్ధారణ జరిగింది.

Also read: Game Changer : జరగండి జరగండి.. ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ వచ్చేనండి..

సంఘటన జరిగిన సమయంలో గాయపడిన కమాండోను అతని సహచరులు ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ ఆయన పరిస్థితి విషమించడంతో వైద్యులు అతనిని లక్నోలోని ట్రామా సెంటర్ కు రెఫర్ చేశారు. ప్రస్తుతం ఆయన లైఫ్ సపోర్ట్ సిస్టంతో ఉంచారు. 53 ఏళ్ల రామ్ ప్రసాద్ అమేథీకి చెందినవాడు. సంఘటన జరిగిన సమయంలో అతను 32వ కార్ప్స్ పీఏసీలో పనిచేస్తున్నాడు. ఘటనకు సంబంధించిన వివరాలు అంతంతమాత్రంగానే ఉన్నా, విచారణ ప్రారంభించారు పోలీసులు. సంఘటన జరిగిన సమయంలో ఆలయ సముదాయంలో ఉన్న అతని సహచరులను పోలీసు అధికారులు ప్రశ్నించడం ప్రారంభించారు.