Costly Cow: దేవుడా.. వేలంలో 40 కోట్లకు అమ్ముడుపోయిన నెల్లూరు ఆవు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశంలో అనేక రకాల మేలు రకపు జాతులకు చెందిన ఆవులు లభ్యం అవుతాయి. అందులో మన తెలుగు రాష్ట్రానికి సంబంధించి ఒంగోలు, నెల్లూరు ప్రాంతాలకు సంబంధించిన కొన్ని మేలు రకానికి సంబంధించిన ఆవులు ప్రసిద్ధిగాంచినవి. ఇకపోతే., తాజాగా భారతదేశానికి సంబంధించిన ఆవు ప్రపంచంలోనే అత్యంత ధరకు అమ్ముడుపోయింది. ఏకంగా భారత సంతతికి సంబంధం ఉన్న ఆవు 40 కోట్ల రూపాయలకు అమ్ముడబోయింది. ప్రస్తుతం ఈ విషయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలకు వెళ్తే..
Also Read
భారతదేశానికి చెందిన మేలురకపు జాతి ఆవు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆవుగా మారింది. వయాటినా-19 ఎఫ్‌ఐవి మారా ఇమోవిస్ జాతి అని పిలవబడే నెల్లూరు జాతికి చెందిన ఆవు ఏకంగా 4.8 మిలియన్ అమెరికన్ డాలర్లకు విక్రయించబడింది. ఇది మన కరెన్సీలో 40 కోట్ల రూపాయలకు సమానం. ప్రస్తుతం 40 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిన ఆవు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాకు చెందిన మేలురకపు ఆవు. అయితే ఈ రకపు ఆవు 1868 లోనే బ్రెజిల్ కి రవాణా చేయబడింది. ఆ తర్వాత ఈ రకపు జాతి ఆవులు ప్రపంచంలో ప్రఖ్యాతి చెందాయి. ఈ జాతి ఆవు శాస్త్రీయ నామం బోస్ ఇండికస్.
Also read: Game Changer : జరగండి జరగండి.. ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ వచ్చేనండి..
ఇక ఈ జాతికి చెందిన ఆవులు ఒక్క బ్రెజిల్ దేశంలోని 16 మిలియన్లు ఉన్నాయంటే ఎంత ప్రాముఖ్యత చెందాయో ఇట్లే అర్థం చేసుకోవచ్చు. ఇవి చూడడానికి తెల్లగా.. అలాగే భుజాలపై పెద్దగా ఉబ్బెత్తుగా మూపురం కలిగి ఉంటాయి. ఈ జాతి ఆవులు వేడి ప్రాంతాలకి సులభంగా అనుకూలిస్తాయి. ఇందులో వ్యాధి నిరోధక శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది.
She is the world's most expensive cow and was auctioned in Arandú, Brazil for around $4.8 million.
Her breed – Nellore cattle that originated from Ongole Cattle originally brought to Brazil from India. They are named after the district of Nellore in Andhra Pradesh, India. pic.twitter.com/BjfvAucI00— Kaveri 🇮🇳 (@ikaveri) March 25, 2024
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!