NTV Telugu Site icon

Ramcharan -Upasana : క్లింకారతో మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న రామ్ చరణ్-ఉపాసన..

Cherry Kinkr

Cherry Kinkr

గ్లోబల్ స్టార్ హీరో, పాన్ ఇండియా రామ్ చరణ్ లు ఇటీవలే తల్లి దండ్రులు అయిన విషయం తెలిసిందే.. వీరిద్దరికీ కూతురు పుట్టింది.. అమ్మాయికి క్లింకార అని నామకరణం కూడా చేశారు.. ఇక పాప పుట్టిన తర్వాత అంతా కలిసి వచ్చింది అంటూ మెగా ఫ్యామిలీ సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది.. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి – రామ్ చరణ్ – పవన్ కళ్యాణ్ తాము చేసే పనులలో సక్సెస్ అవుతున్నారు..

అంతేకాదు వరుణ్ తేజ్ ఏకంగా పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిలైపోయాడు . ఇలా బ్యాక్ టు బ్యాక్ మెగా ఫ్యామిలీకు గుడ్ న్యూస్ లు అందించిన క్లింకార వాళ్ళ ఫ్యామిలీకి ఎంతో స్పెషల్ అంటూ మెగాస్టారే అనౌన్స్ చేశారు . అయితే ఇంత స్పెషల్ అయిన క్లిం కార ను చూడాలని మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. రామ్ చరణ్, ఉపాసనలు తమ కూతురిని మాత్రం గొప్యంగా ఉంచుతున్నారు.. ఇటీవల ముంబైకి వెళ్ళినప్పుడు కూడా క్లింకార ను కనిపించకుండా ఉంచారు..

ఇక తాజాగా క్లింకారకు ఆరు నెలలు పూర్తి కావడంతో రామ్ చరణ్ ఉపాసన దంపతులు తమ కూతురితో కలిసి ముంబైలోని మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు.. అక్కడ తమ కూతురు పేరుతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఇక వేద పండితులు కూడా పాప ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశీర్వదించారు.. ప్రస్తుతం ఆలయానికి వెళ్ళినప్పుడు ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం గేమ్‌ ఛేంజర్‌ మూవీలో నటిస్తున్నారు. క్రియేటివ్‌ డైరెక్టర్‌ శంకర్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది..

Show comments