Ramayana Movie Piracy: ‘రామాయణ: పార్ట్ 1’ మూవీ పైరసీ.. ఇక థియేటర్లలో వీడియోలు రికార్డ్ చేస్తే క్రిమినల్ కేసే..!

Ramayana Part 1 Twitter Review

Ramayana Part 1 Twitter Review

Ramayana Movie Piracy: థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ‘రామాయణ: పార్ట్ 1’ (Ramayana: Part 1) మూవీకి ఇప్పుడు పైరసీ (Piracy) ముప్పు వాటిల్లింది. బిగ్ స్క్రీన్స్ పై సినిమా ప్లే అవుతున్న సమయంలో కొందరు సీన్లను వీడియోలు తీసి సోషల్ మీడియాలో (Social Media) విచ్చలవిడిగా లీక్ చేస్తున్నారు. ఇలాంటి లీక్డ్ క్లిప్స్ (Leaked Clips) ఆన్‌లైన్‌లో వైరల్ అవ్వడంపై చిత్ర నిర్మాతలు తీవ్రంగా మండిపడ్డారు. ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్న మేకర్స్, పైరసీకి పాల్పడే వారిపై కఠినమైన లీగల్ యాక్షన్ (Legal Action) తీసుకుంటామని గట్టి హెచ్చరికలు జారీ చేశారు.

ఈ మేరకు చిత్రబృందం తమ అధికారిక ఇన్స్టాగ్రామ్ (Instagram), ఎక్స్ ఖాతాల ద్వారా ఒక లీగల్ నోటీస్‌ను షేర్ చేసింది. థియేటర్ల లోపల రికార్డ్ చేసిన వీడియోలను వాట్సాప్, ఇతర మెసేజింగ్ యాప్స్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేయవద్దని ప్రేక్షకులకు విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే ఇలాంటి క్లిప్స్ అప్‌లోడ్ చేసిన వారు వెంటనే వాటిని డిలీట్ చేయాలని స్పష్టం చేసింది. కాపీరైట్ యాక్ట్ 1957 (Copyright Act, 1957), సినిమాటోగ్రాఫ్ యాక్ట్ 1952 (Cinematograph Act, 1952), బీఎన్ఎస్ 2023, ఐటీ యాక్ట్ 2000 ప్రకారం సినిమా క్లిప్పింగ్స్ రికార్డ్ చేయడం లేదా షేర్ చేయడం తీవ్రమైన నేరమని పేర్కొంది. ఇది క్రిమినల్ ఆఫెన్స్ కిందకి వస్తుందని, ఇలాంటి పనులకు పాల్పడితే జైలు శిక్షతో పాటు భారీ జరిమానా పడుతుందని, కోర్టు ఆదేశాలను ధిక్కరించినట్లే అవుతుందని హెచ్చరించింది. ఇకపై ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండానే నేరుగా క్రిమినల్, సివిల్ చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పింది.

నిజానికి సినిమా రిలీజ్ కాకముందే బాంబే హైకోర్టు (Bombay High Court) పైరసీ నుంచి రక్షణ కల్పిస్తూ ఒక మధ్యంతర ఉత్తర్వు కూడా జారీ చేసింది. గాడ్‌పవర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అనే ప్రొడక్షన్ కంపెనీ దాఖలు చేసిన కాపీరైట్ పిటిషన్‌పై జస్టిస్ మాధవ్ జమ్‌దార్ ఈ ఆదేశాలు ఇచ్చారు. ఈ సంస్థకే భారత్‌లో అలాగే ఓవర్సీస్ లో (Overseas) రామాయణ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఉన్నాయి. సినిమా స్క్రిప్ట్, క్యారెక్టర్లు, ఫుటేజ్, లిరిక్స్ తో పాటు ఆడియో రికార్డింగ్స్ పై పూర్తి కాపీరైట్స్ తమవేనని ప్రొడక్షన్ హౌస్ కోర్టుకు తెలిపింది. ప్రైవేట్ ప్రివ్యూ స్క్రీనింగ్స్ సమయంలో కాన్ఫిడెన్షియాలిటీ అగ్రిమెంట్లు ఉన్నప్పటికీ, ట్రైలర్ క్లిప్స్‌ను దొంగతనంగా రికార్డ్ చేసి ఆన్‌లైన్‌లో షేర్ చేశారని లాయర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో బాంబే కోర్టు స్పందిస్తూ.. గుర్తింపు లేని వ్యక్తులు లేదా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు అనుమతి లేకుండా కంటెంట్‌ను అప్‌లోడ్ చేయడంపై స్టే విధించింది. కంప్లైంట్ రాగానే అలాంటి పైరేటెడ్ కంటెంట్‌ను బ్లాక్ చేయడానికి గూగుల్ (Google) వంటి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు కూడా అంగీకరించారు.