Ramayana Box Office Collection: బాక్సాఫీస్ వద్ద ‘రామాయణం’ సునామీ.. 6 రోజుల్లోనే సరికొత్త రికార్డులు

Ramayana 300kb

Ramayana 300kb

Ramayana Box Office Collection: బాక్సాఫీస్ వద్ద రణ్‌బీర్ కపూర్ ‘రామాయణం’ (Ramayana: Rise Of A Legend) సునామీ సృష్టిస్తోంది. నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మైథలాజికల్ మూవీ రికార్డుల వేటను కొనసాగిస్తోంది. విడుదలైన కేవలం 6 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 800 కోట్ల క్లబ్‌ దాటి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ. 823.50 కోట్ల Gross (గ్రాస్) వసూలు చేసి, ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక సరికొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ ప్రయాణంలో స్పీడ్ మాత్రమే కాదు, డొమెస్టిక్, ఓవర్సీస్ మార్కెట్లలో ఇది చూపిస్తున్న ఇంపాక్ట్ కూడా మామూలుగా లేదు.

సచ్నిల్క్ (Sacnilk) డేటా ప్రకారం.. భాయ్ దూజ్ (Bhai Dooj) పండుగ సెలవు కలిసి రావడంతో 6వ రోజు మంగళవారం కూడా ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇండియాలో డే 6 నాడు రూ. 94.10 కోట్ల నెట్ వసూలు చేసింది. దీంతో దేశీయంగా మొత్తం నెట్ కలెక్షన్స్ రూ. 440.45 కోట్లకు చేరుకున్నాయి. ఇండియాలో గ్రాస్ వసూళ్లు రూ. 526.50 కోట్లుగా ఉండగా, ఓవర్సీస్ మార్కెట్ల నుంచి రూ. 297 కోట్లు వచ్చాయి. రెండూ కలిపి వారం తిరక్కుండానే రూ. 823.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించడం నిజంగా విశేషం.

విడుదలైనప్పటి నుంచి ఈ సినిమా ఎక్కడా స్పీడ్ తగ్గించకపోవడం అసలైన విశేషం. సోమవారం రోజున ఇండియన్ సినీ చరిత్రలోనే అత్యుత్తమ కలెక్షన్లు సాధించి రికార్డ్ సృష్టించగా, మంగళవారం రోజు కూడా థియేటర్ల వద్ద భారీ రష్ కనిపించింది. ఫెస్టివల్ హాలిడేస్, తగ్గిన టికెట్ ధరలు, పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నాయి. మంగళవారం నాటి వసూళ్లు సోమవారం సాధించిన రూ. 107.50 కోట్లతో పోలిస్తే 12.5 శాతం తగ్గినా, ఓవరాల్‌గా బాక్సాఫీస్ వద్ద సినిమా మోమెంటమ్ మాత్రం స్ట్రాంగ్‌గా ఉంది.

ఇండియాలో రోజువారీ గ్రాస్ (Gross) కలెక్షన్స్ ఒకసారి చూస్తే:

డే 1: రూ. 77.50 కోట్లు
డే 2: రూ. 57.30 కోట్లు
డే 3: రూ. 83.45 కోట్లు
డే 4: రూ. 66.95 కోట్లు
డే 5: రూ. 128.70 కోట్లు
డే 6: రూ. 112.60 కోట్లు
మొత్తం ఇండియా గ్రాస్ కలెక్షన్: రూ. 526.50 కోట్లు.