సాధారణంగా దొంగలు ఇంట్లోని డబ్బు, నగలను దొంగిలిస్తుంటారు. ఏమీ దొరకని సమయంలో విలువైన వస్తువులను ఎత్తుకెళుతుంటారు. అయితే ఇటీవలి కాలంలో కొందరు ఇంటి బయట ఆరేసిన బట్టలను కూడా దొంగలించారు. ఇదే వింత అనుకుంటే.. తాజాగా మరో వింత చోటుచేసుకుంది. ఇంటి బయట వదిలిన షూస్ ఎత్తుకెళుతున్నాడో వింత దొంగ. 100కు పైగా ఇళ్లలో షూస్ దొంగతనం చేసి.. చివరకు పట్టుపడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని రామంతపూర్‌లో చోటుచేసుకుంది.
ఉప్పల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మల్లేష్ అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా రామంతపూర్ పరిధిలో ఇంటి బయట వదిలిన షూస్ దొంగతనం చేస్తున్నాడు. ప్రతి రోజు కొత్త కొత్త షూస్ ఎత్తుకెళుతున్నాడు. ఇప్పటికే 100కు పైగా ఇళ్లలో షూస్ దొంగతనం చేశాడు. షూస్ మాయం అవుతుండటంతో.. రామంతపూర్ వాసులు నిఘా పెట్టారు. కాపు కాసి మరీ షూస్ దొంగ మల్లేష్‌ను పట్టుకున్నారు. అతడిని చితకబాది.. ఉప్పల్ పోలీసులకు అప్పగించారు.
Also Read: Gabba Test: గబ్బా టెస్ట్.. వ్యూహం మార్చిన టీమిండియా!
ఉప్పల్ పోలీసులు మల్లేష్‌పై కేసు నమోదు చేసి విచారించగా అసలు విషయం తెలిసింది. రామంతపూర్‌లో కొట్టేసిన షూస్‌ను ఎర్రగడ్డ మార్కెట్లో రూ.100, రూ.200కి అమ్ముతున్నా అని తెలిపాడు. దాంతో పోలీసులు కంగు తిన్నారు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. ఇటీవల మద్యం మత్తులో వచ్చి పోలీస్ స్టేషన్‌లో హల్చల్ చేసిన మహిళ మల్లేష్ భార్యగా పోలీసులు గుర్తించారు. బరాబర్ తగిన సర్ అని పోలీసులతో ఓ మహిళ అంటున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే.