తెలుగు స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. వయస్సు పెరిగిన చెక్కుచెదరని అందంతో ఇండస్ట్రీలో రానిస్తుంది..ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా మెప్పించిన ఈమె ఇప్పుడు తల్లి పాత్రల్లో కనిపిస్తుంది..ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా రమ్యకృష్ణ కు ఎక్కువే..అంతే కాదు ప్రత్యేకంగా కొన్ని పాత్రలకు పెట్టింది పేరుగా రమ్యకృష్ణ పేరు దక్కించుకోవడం గమనార్హం. ఒకానొక సమయంలో హీరో సెంట్రిక్ మూవీలలో హీరోయిన్గా నటించడమే కాదు.. లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటించి మెప్పించింది..
బాహుబలి సినిమాలో శివగామిగా గర్జించిన ఈమె రీసెంట్గా వచ్చిన రంగమార్తండా సినిమాలో సైలెంట్ గా కనిపించి ఆకట్టుకుంది..వయసు మీద పడుతున్నా కూడా తన అందంలో ఏమాత్రం మార్పు రాకుండా పూర్తీ గ్లామరస్ మెయింటైన్ చేస్తూ కుర్ర హీరోయిన్లకు సైతం పోటీ ఇస్తుంది.. అయితే ఇప్పుడు రమ్యకృష్ణ గురించి ఓ వార్త చక్కర్లు కొడుతుంది.. ఎన్నో సినిమాల్లో నటించిన రమ్యకృష్ణ చాలా మంది హీరోయిన్లకు డబ్బింగ్ కూడా చెప్పిందని తెలుస్తుంది..
డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన ఖడ్గం అనే చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ కూడా ప్రతి ఇండిపెండెన్స్ డే కి ఈ సినిమాను తప్పకుండా టీవీలలో వేస్తూ ఉంటారు.. ఈ సినిమాలో శ్రీకాంత్ కు జంటగా సోనాలి బింద్రే నటించింది.. ఆ పాత్రకు రమ్య డబ్బింగ్ చెప్పిందట.. తన సినిమాలకు తానే డబ్బింగ్ చెప్పుకునే అలవాటు కూడా లేని రమ్యకృష్ణతో ఈ సినిమాలో డబ్బింగ్ చెప్పించారట కృష్ణవంశీ.. రమ్యకృష్ణ లో ఉన్న ఈ టాలెంట్ కు ఆమె ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు..