Site icon NTV Telugu

Ramabanam : ఓటీటీ లోకి వచ్చేసిన రామబాణం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Whatsapp Image 2023 09 14 At 8.00.45 Am

Whatsapp Image 2023 09 14 At 8.00.45 Am

గోపీచంద్‌ నటించిన లేటెస్ట్ మూవీ రామబాణం.శ్రీవాస్‌ తెరకెక్కించిన ఈ మూవీలో డింపుల్‌ హయతీ గోపీచంద్ సరసన హీరోయిన్‌గా నటించింది.ఈ సినిమాలో గోపీచంద్‌ అన్నయ్య గా జగపతిబాబు ఓ కీలక పాత్ర పోషించగా, ఖుష్బూ మరో ప్రధాన పాత్రలో నటించి మెప్పించారు. ఈ మూవీ విడుదలకు ముందు పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్‌ తో ప్రేక్షకులలో ఎంతో ఆసక్తి రేకెత్తించారు మేకర్స్. కానీ రామబాణం సినిమా థియేటర్లలోకి వచ్చాక పెద్దగా ఆడలేకపోయింది. మే 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మాస్‌ యాక్షన్‌ డ్రామా బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.రోటీన్‌ కథ కావడం తో ప్రేక్షకులకి అంతగా నచ్చలేదు.బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా వసూళ్లు కూడా రాబట్టలేదు.అయితే సినిమాలో గోపీచంద్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ మాత్రం ఫ్యాన్స్‌ని బాగా మెప్పించాయి.

థియేటర్ల లో అంతగా ఆకట్టుకోని రామబాణం త్వరగానే ఓటీటీ లో స్ట్రీమ్ అవుతుందని అంతా భావించారు. అయితే ఈ సినిమా ఓటీటీ లోకి అడుగు పెట్టడానికి నాలుగు నెలల వరకు ఆ ముహూర్తం కుదరలేదు. రామబాణం మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ సోనీ లివ్‌ కొనుగోలు చేసింది. గురువారం (సెప్టెంబర్‌ 14) అర్ధరాత్రి నుంచే ఈ మూవీ ఓటీటీలో కి అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం తెలుగు తో పాటు తమిళం, కన్నడ, మలయాళం, కన్నడ భాషలలో రామబాణం సినిమా స్ట్రీమింగ్‌ అవుతోంది.దాదాపు 4 నెలల తర్వాత రామబాణం సినిమా ఓటీటీలోకి రావడంతో గోపీచంద్‌ ఫ్యాన్స్‌ కూడా ఎంతో హ్యాపీగా ఉన్నారు. ఈ సినిమా ను పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిబొట్ల నిర్మించారు.ఈ మూవీలో నాజర్, తరుణ్‌ అరోరా, వెన్నెల కిశోర్‌ వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. మిక్కీ జే మేయర్‌ ఈ సినిమా కు సంగీతం అందించారు.. మరి థియేటర్లలో అంతగా ఆకట్టుకోని రామబాణం మూవీ ఓటీటీ ప్రేక్షకులనైనా మెప్పిస్తుందేమో చూడాలి.

Exit mobile version