Ramabanam : ఓటీటీ లోకి వచ్చేసిన రామబాణం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గోపీచంద్ నటించిన లేటెస్ట్ మూవీ రామబాణం.శ్రీవాస్ తెరకెక్కించిన ఈ మూవీలో డింపుల్ హయతీ గోపీచంద్ సరసన హీరోయిన్‌గా నటించింది.ఈ సినిమాలో గోపీచంద్ అన్నయ్య గా జగపతిబాబు ఓ కీలక పాత్ర పోషించగా, ఖుష్బూ మరో ప్రధాన పాత్రలో నటించి మెప్పించారు. ఈ మూవీ విడుదలకు ముందు పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్ తో ప్రేక్షకులలో ఎంతో ఆసక్తి రేకెత్తించారు మేకర్స్. కానీ రామబాణం సినిమా థియేటర్లలోకి వచ్చాక పెద్దగా ఆడలేకపోయింది. మే 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మాస్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.రోటీన్ కథ కావడం తో ప్రేక్షకులకి అంతగా నచ్చలేదు.బాక్సాఫీస్ వద్ద పెద్దగా వసూళ్లు కూడా రాబట్టలేదు.అయితే సినిమాలో గోపీచంద్ యాక్షన్ సీక్వెన్స్ మాత్రం ఫ్యాన్స్‌ని బాగా మెప్పించాయి.
థియేటర్ల లో అంతగా ఆకట్టుకోని రామబాణం త్వరగానే ఓటీటీ లో స్ట్రీమ్ అవుతుందని అంతా భావించారు. అయితే ఈ సినిమా ఓటీటీ లోకి అడుగు పెట్టడానికి నాలుగు నెలల వరకు ఆ ముహూర్తం కుదరలేదు. రామబాణం మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్ కొనుగోలు చేసింది. గురువారం (సెప్టెంబర్ 14) అర్ధరాత్రి నుంచే ఈ మూవీ ఓటీటీలో కి అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం తెలుగు తో పాటు తమిళం, కన్నడ, మలయాళం, కన్నడ భాషలలో రామబాణం సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.దాదాపు 4 నెలల తర్వాత రామబాణం సినిమా ఓటీటీలోకి రావడంతో గోపీచంద్ ఫ్యాన్స్ కూడా ఎంతో హ్యాపీగా ఉన్నారు. ఈ సినిమా ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మించారు.ఈ మూవీలో నాజర్, తరుణ్ అరోరా, వెన్నెల కిశోర్ వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. మిక్కీ జే మేయర్ ఈ సినిమా కు సంగీతం అందించారు.. మరి థియేటర్లలో అంతగా ఆకట్టుకోని రామబాణం మూవీ ఓటీటీ ప్రేక్షకులనైనా మెప్పిస్తుందేమో చూడాలి.
Also Read
- Trump-Israel: ఇజ్రాయెల్‌కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
- Mahua Moitra: మహువా మోయిత్రా కారుపై ఎగ్ అటాక్.. సుప్రీంకోర్టు జడ్జిపై సెటైర్లు..
- Rama Nandana: "మొగుడిని బాత్రూమ్లో దాచేది".. యూట్యూబర్ రమానందన స్కామ్‌లో సంచలన నిజాలు..
- UP Elections: రంగంలోకి RSS.. BJPతో కలిసి యూపీలో వ్యూహాత్మక కసరత్తు
తాజావార్తలు
-
Trump-Israel: ఇజ్రాయెల్‌కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
-
Mahua Moitra: మహువా మోయిత్రా కారుపై ఎగ్ అటాక్.. సుప్రీంకోర్టు జడ్జిపై సెటైర్లు..
-
Rama Nandana: “మొగుడిని బాత్రూమ్లో దాచేది”.. యూట్యూబర్ రమానందన స్కామ్‌లో సంచలన నిజాలు..
-
Jason Sanjay: నాన్న సీఎం అయినప్పుడు నా ఫీలింగ్ ఇదే.. : జాసన్ సంజయ్
-
Harish Rao : రేవంత్ రెడ్డివన్నీ డైవర్షన్ రాజకీయాలు, పచ్చి అబద్ధాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!