Site icon NTV Telugu

Andhra King Taluka: ‘నువ్వుంటే చాలే’ అంటున్న రామ్ పోతినేని..!(వీడియో)

Andhra King Taluka

Andhra King Taluka

Andhra King Taluka: యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ‘ఆంధ్ర కింగ్‌ తాలూకా’ సినిమాలోని మొదటి పాట “నువ్వంటే చాలే” లిరికల్‌ వీడియో విడుదలైంది. రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మహేష్ బాబు దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. ఇకపోతే ఈ పాటకు రామ్ పోతినేని స్వయంగా రాసిన లిరికల్స్ అసలైన హైలైట్. ఆయన రాసిన పదాలు చక్కగా అర్థవంతంగా ఉండేలా ఉంటే, ఒక్కో లైన్ వెనుక ఒక భావం ఉన్నట్లు అనిపిస్తుంది.

Pet Cats Save Woman: మహిళ ప్రాణాలను కాపాడిన పెంపుడు పిల్లులు..! సీసీటీవీ ఫుటేజ్‌ వైరల్..

ఈ పాటకు కేవలం సంగీతం మాత్రమే కాదు.. విజువల్స్ కూడా మరో స్థాయికి తీసుకెళ్తున్నాయి. రామ్, భాగ్యశ్రీల మధ్య కెమిస్ట్రీ బాగానే ఉన్నట్లుగానే కనిపిస్తోంది. గ్రామీణ నేపథ్యంలో తీసిన అందమైన దృశ్యాలు కనపడుతున్నాయి. ఈ సినిమాకు మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ పాడిన ఈ పాటకు వివేక్‌, మెర్విన్‌ సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలతో వస్తున్న ఈ సినిమా, రామ్ కెరీర్‌లో మరో వినూత్న ప్రయత్నంగా నిలవబోతోందని భావిస్తున్నారు. ఈ సినిమా అతి త్వరలో విడుదల కానుంది. విడుదల తేదీపై మూవీ టీం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

TGEAPCET-2025: టీజీ ఎంసెట్ అడ్మిషన్ల మొదటి విడత సీట్ల కేటాయింపు.. చెక్ చేసుకోండిలా..

Exit mobile version