Site icon NTV Telugu

Arun Yogiraj: భూమ్మీద అత్యంత అదృష్టవంతుడిని నేనే..

Shlpi

Shlpi

అయోధ్యలో అపురూప రామ మందిరం ఆవిష్కృతమైంది. జయజయ ధ్వానాల మధ్య బాలరాముడు ఆలయంలో కొలువుదీరారు. ప్రధాని మోడీ చేతుల మీదుగా అభిజిత్ లఘ్నంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా కొనసాగింది. కాగా.. రాముడి విగ్రహాన్ని చెక్కిన శిల్పి అరుణ్ యోగిరాజ్ తొలిసారి స్పందించారు. భూమిపై అత్యంత అదృష్టవంతుడని భావిస్తున్నానని ఆయన అమితానందం వ్యక్తం చేశారు. ఇదంతా కల మాదిరిగా అనిపిస్తోందని అన్నారు. “నా పూర్వీకులు, కుటుంబ సభ్యులు, ఆ భగవంతుడు శ్రీరాముడి ఆశీర్వచనాలు నాకు ఎప్పటికీ ఉంటాయి. కొన్నిసార్లు నేను కలల ప్రపంచంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది’’ అని యోగిరాజ్ అన్నారు.

Read Also: Ram Temple Inauguration: రామ మందిర ప్రారంభోత్సవం.. బిడ్డకు ‘రామ్ రహీమ్’ పేరు పెట్టిన ముస్లిం మహిళ..

అయోధ్య రామ మందిరంలో ప్రతిష్టించే రాముని విగ్రహాన్ని ఎంపిక చేయడానికి శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర సమావేశంలో ఓటింగ్ నిర్వహించారు. ప్రత్యేక శిల్పులు రూపొందించిన మూడు నమూనాల్లో ఒక విగ్రహాన్ని ఎంపిక చేశారు. ఇందులో యోగిరాజ్ చెక్కిన బాలరాముని విగ్రహానికి ఎక్కువ ఓట్లు పొందిన అత్యుత్తమ విగ్రహంగా నిలిచింది. కాగా.. కర్ణాటకకు చెందిన శిల్పి యోగిరాజ్.. గతంలో ఎన్నో దేవాలయాల కోసం ఎన్నో విగ్రహాలను రూపొందించాడు. అయినప్పటికీ.. రామ్ లల్లా విగ్రహం కోసం యావత్ దేశం ఎదురుచూసిందని.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు వేయి కళ్లతో ఎదురుచూశారని.. ఇలాంటి అనుభూతి ఎప్పుడూ పొందలేదని శిల్పి చెప్పాడు. యోగిరాజ్ తన కుటుంబంలో ఐదవ తరం శిల్పి.

Read Also: Ram Mandir: అయోధ్య బాలరాముడికి అత్యధిక విరాళం ఇచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా…?

Exit mobile version