NTV Telugu Site icon

Ram Gopal Varma: ఏపీ హైకోర్టులో రామ్‌గోపాల్‌ వర్మ మరో పిటిషన్!

Rgv

Rgv

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఏపీ హైకోర్టులో మరో పిటిషన్ వేశారు. తాను ఎక్స్‌లో పెట్టిన పోస్టుపై అనేక కేసులు నమోదు చేస్తున్నారని, చట్టవిరుద్ధంగా ఒక విషయంపై ఇన్ని కేసులు పెట్టడం సమంజసం కాదని ఆర్జీవీ పిటిషన్ వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు చేయడం చట్ట విరుద్ధమని, ఇకపై కేసులు నమోదు చేయకుండా ఆదేశించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇప్పటివరకు తనపై నమోదైన కేసులు క్వాష్ చేయాలని ఆర్జీవీ కోరారు. ఈరోజు ఆర్జీవీ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారించనుంది. ఆర్జీవీ ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Also Read: Top Headlines @9AM: టాప్‌ న్యూస్‌!

వ్యూహం సినిమా విడుదల సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌లపై రామ్‌గోపాల్‌ వర్మ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారు. దాంతో ఒంగోలు, విశాఖ, గుంటూరు జిల్లాలో వేరు వేరుగా వర్మపై కేసులు నమోదయ్యాయి. ఒంగోలులో నమోదైన కేసుకు సంబంధించి ఆర్జీవీకి రెండు సార్లు నోటీసులు ఇచ్చినా.. ఆయన హాజరుకాలేదు. దీంతో ఏపీ పోలీసులు ఆయనను వెతికే పనిలో పడ్డారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి పోలీసులు వెళ్లినా ఆచూకీ తెలియరాలేదు. గత నాలుగు రోజులుగా ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. తాను ఎక్కడకు పారిపోలేదని రోజుకో వీడియో రిలీజ్ చేస్తున్నారు. దాంతో ఆర్జీవీ కోసం ప్రకాశం జిల్లా పోలీసులు హైదరాబాద్, తమిళనాడులో వేట సాగిస్తున్నారు.