గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నారు.. అంతేకాదు బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమాను చేయబోతున్నట్లు ప్రకటించారు.. ఆ సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలను జరుపుకుంది.. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనున్నారు. ప్రస్తుతం షెడ్యూల్ గ్యాప్ వచ్చింది.. దాంతో చరణ, ఉపాసనతో కలిసి సమ్మర్ వేకేషన్ కు వెళ్లారు.. ఆ ట్రిప్ కు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
సమ్మర్ వేకేషన్ కు బ్యాంకాక్ వెళ్లిన వీరిద్దరితో పాటు మరో ఇద్దరు జంటలు కూడా ఉన్నారు.. అందరూ కలిసి బ్యాంకాక్ లో చిల్ అవ్వడానికి సమ్మర్ వెకేషన్ గా ప్లాన్ చేసుకున్నారు.అలాగే చరణ్ తో పాటు ఎప్పుడూ తన వెంటే ఉండే తన పెంపుడు కుక్కపిల్ల రైమ్ కూడా బ్యాంకాక్ కి వెళ్ళింది.. తాజాగా రైమ్ సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఫోటోలను షేర్ చేశారు.. ఆ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి..
ఆ ఫోటోలలో రామ్ చరణ్ ఉపాసానలతో మరో ఇద్దరు జంటలు ఆ ఫోటోలలో కనిపిస్తున్నారు.. బ్యాంకాక్ లో సముద్రం పక్కన ఉన్న ఓ రిసార్ట్ లో ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది. ఇలాంటి ట్రిప్స్ కి వెళ్తే ఉపాసన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.. ఇప్పుడు ఇంకేదైనా కొత్తగా షేర్ చేస్తుందేమో అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. గేమ్ చేంజర్ సినిమాను మే కు పూర్తి చేసి అక్టోబర్ 31 కి విడుదల చెయ్యాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు..