Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ మూవీ “గేమ్ ఛేంజర్”. ఈ సినిమా కోసం మెగా ఫాన్స్ ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఎట్టకేలకు ఈ చిత్రం నుంచి క్రేజీ అప్డేట్స్ బయటకి వస్తున్నాయి. తాజాగా సినిమా నుంచి మాస్ సింగిల్ ‘రా మచ్చా మచ్చా’ సాంగ్ విడుదల చేశారు మేకర్స్. ఆ సాంగ్ ఇప్పుడు ఎక్కడ చూసినా అదరగొడుతుందని చెప్పాలి.
Read Also:Vizag Steel Plant: స్టీల్ ప్లాంట్ పోరాటం ఉధృతం.. నేటి నుంచి సత్యాగ్రహ దీక్షలు..
ముఖ్యంగా రామ్ చరణ్ గ్రేస్.. థమన్ మాస్ బీట్స్ తో మెగా ఫ్యాన్స్ కు బాగా ఎక్కేసినట్లు కనిపిస్తుంది. అలా యూట్యూబ్ లో ఈ సాంగ్ కి సాలిడ్ రెస్పాన్స్ కూడా వస్తుంది. తక్కువ సమయంలోనే 10 మిలియన్ కి పైగా వ్యూస్ ని ఒక్క తెలుగు వెర్షన్ లోనే రాబట్టి.. మన టాలీవుడ్ రీసెంట్ ఫస్ట్ సింగిల్స్ లో అదరగొడుతుందని అని చెప్పాలి. ఈ పాటను అనంత్ శ్రీరామ్ రాశారు. ఇక ఈ చిత్రంలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటిస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నారు. అలాగే ఈ డిసెంబర్ రేస్ లో క్రిస్మస్ కానుకగా రిలీజ్ కి తీసుకురాబోతున్నారు.
Read Also:Arasavilli temple: అరసవల్లి ఆలయంలో అద్భుత దృశ్యం.. ఆదిత్యుని పాదాలను తాకిన సూర్య కిరణాలు
Yay 🚁🥁🏆💥 #RaaMachaMacha 🔂 https://t.co/MMmllnACFg
— thaman S (@MusicThaman) October 1, 2024