Site icon NTV Telugu

Peddi Update: పెద్ది.. ఇది అస్సలు ఊహించలేదుగా?

Ram Charan Peddi

Ram Charan Peddi

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘పెద్ది’. బుచ్చిబాబు దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఉత్తరాంధ్ర నేపథ్యంలో విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా పెద్ది రూపొందుతోంది. క్రికెట్‌తో పాటు ఎమోషన్ ఈ సినిమాలో హైలెట్‌గా నిలుస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్‌గా మారింది. పెద్ది ఒకటి కాదు.. రెండు అని తెలుస్తోంది.

పెద్ది సినిమాను రెండు పార్టులుగా ప్లాన్ చేస్తున్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. ఇందులో నిజమెంతో తెలియదు గానీ, పెద్దిని మాత్రం బుచ్చిబాబు గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు. ఒకవేళ కథను ఒక్క పార్ట్‌లో చెప్పకుంటే.. సీక్వెల్ ఉండే ఛాన్స్ ఉంది. లేదంటే ఒక్క భాగంతోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని.. ఇప్పటికే ఫస్ట్ షాట్‌తో చెప్పేశాడు బుచ్చిబాబు. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆఏర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

Also Read: Shubman Gill: కెప్టెన్‌గా శుభ్‌మ‌న్ గిల్.. ఓపెనర్‌గా రోహిత్ స్థానంలో ఎవరంటే?

ప్రస్తుతం పెద్ది సినిమా హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్ నుంచి లేటెస్ట్‌గా చరణ్ కొన్ని ఫోటోలు షేర్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చరణ్‌తో పాటు మీర్జాపూర్ నటుడు దివ్యేందు శర్మ కూడా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు కీలక సన్నివేశాలు చిత్రకరీస్తున్నారు. 2026 మార్చి 27న పెద్ది రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ అయిపోయేలోపు.. పెద్ది ఒకటా? రెండా? అనే క్లారిటీ రానుంది.

Exit mobile version