Site icon NTV Telugu

Ram Charan-Upasana: నా భార్య కావడం వలనే ఉపాసనకు గుర్తింపు రాలేదు: రామ్‌ చరణ్‌

Ram Charan Upasana

Ram Charan Upasana

Ram Charan Heap Praise on Upasana: కేవలం తన భార్య కావడం వల్లే ఉపాసనకు గుర్తింపు రాలేదని, ఆమె చేసే ఎన్నో మంచి పనులే ఈ స్థాయిలో ఉంచాయని హీరో రామ్‌ చరణ్‌ అన్నారు. ఉపాసన పలు రంగాల్లో తనదైన ముద్ర వేశారని, కుటుంబ విలువలను గౌరవిస్తుందని మెగా పవర్ స్టార్ చెప్పారు. తనకు వివాహం కాగానే వేరే ప్రపంచానికి వచ్చినట్లు అనిపించిందని, కానీ ఇప్పుడు చరణ్‌కి నీడలా ఉంటుంన్నందుకు ఎంతో గర్వంగా ఉందని ఉపాసన పేర్కొన్నారు. మార్చి 8న ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’. ఈ సందర్భంగా రామ్‌ చరణ్‌, ఉపాసన దంపతులు తాజాగా జాతీయ మీడియా హిందుస్థాన్ టైమ్స్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

రామ్‌ చరణ్‌ మాట్లాడుతూ… ఉపాసన ఓ స్టార్ భార్య మాత్రమే కాదు అని అన్నారు. ‘నా సతీమణి కావడం వల్లే ఉపాసనకు గుర్తింపు రాలేదు. ఉపాసన చేసే ఎన్నో మంచి పనులే ఆమెను ఈ స్థాయిలో ఉంచాయి. పలు రంగాల్లో ఆమె తనదైన ముద్ర వేసింది. కుటుంబ విలువలను గౌరవిస్తుంది. కుటుంబ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్తుంది. ఆమె నా రాక్ స్టార్. ఆమె చేసే పనిని నేను ఎప్పుడూ చేయలేను. ఉపాసన తన స్వంత మార్గాన్ని సృష్టించుకుంది’ అని చరణ్‌ పొగడ్తల వర్షం కురిపించారు. రామ్ చరణ్, ఉపాసన కొణిదెల 2012లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహం అయిన 12 సంవత్సరాల తర్వాత వారికి పాప జన్మించింది.

Also Read: Gopichand-Prabhas: ప్రభాస్‌తో తప్పకుండా సినిమా చేస్తా.. పెళ్లి గురించి మాత్రం తెలియదు: గోపీచంద్‌

ఉపాసన మాట్లాడుతూ.. ‘మాది, రామ్‌ చరణ్‌ వాళ్లది భిన్నమైన కుటుంబ నేపథ్యాలు. నాకు వివాహం అయ్యాక వేరే ప్రపంచానికి వచ్చినట్లు అనిపించింది. కానీ ఇప్పుడు చరణ్‌కి నీడలా ఉంటుంన్నందుకు గర్వంగా ఉంది. ఒకరికొకరం మద్దతుగా ముందుకు సాగుతున్నాం. బిడ్డను కనాలని నిర్ణయించుకున్నప్పుడే క్లీంకారకు జన్మనిచ్చాం. మా అమ్మ వాళ్లను తాతయ్య ఆత్మవిశ్వాసంతో పెంచారు. మా కుటుంబంలోని మహిళలు నా జీవితంలో కీలక పాత్ర పోషించారు’ అని చెప్పారు. తాజాగా చరణ్‌, ఉపాసన దంపతులు అనంత్‌ అంబానీ, రాధిక మర్చంట్‌ ప్రీ వెడ్డింగ్‌ వేడుకలకు హాజరైన విషయం తెలిసిందే.

Exit mobile version