Ram Charan New Movie Update: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న RC 15 పై భారీ అంచనాలున్నాయి. ఇక శంకర్ సినిమా అంటే నటుల్ని తాను ఎలా చెక్కుతాడో తెలిసిందే. అలాగే ఈ సినిమాలో కూడా చరణ్ చాలా కొత్త గెటప్స్ లో వేరియేషన్స్ లో కనిపిస్తున్నాడు. అలాగే ఈ సినిమాలో చరణ్ తండ్రి కొడుకుగా కనిపిస్తాడని తెలిసిందే. అయితే తండ్రి రోల్ ఫ్లాష్ బ్యాక్ లో ఉండగా ఇప్పుడు ఇందులో ఓ క్రేజీ ఎపిసోడ్ పై కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యి షాకింగ్ గా మారాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు పాత్రలను పోషిస్తున్నట్లు సమాచారం. ఒకటి ముఖ్యమంత్రి అయితే మరో పాత్రలో ఎన్నికల అధికారిగా కనిపించబోతున్నారు రామ్ చరణ్. ఈ సినిమా న్యూ షెడ్యూల్ షూటింగ్ రాజమండ్రిలో జరుగుతోంది. గోదావరి తీరంలో ప్రకృతి అందాల నడుమ.. పరిసర ప్రాంతంలో షూటింగ్ జరుగుతుంది.
Read Also: Veera Simha Reddy New Song Launch: సంధ్య థియేటర్లో ‘మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే’
ఇది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కి సంబంధించిన షూటింగ్. అందుకు తగ్గట్టుగా రామ్ చరణ్ గెటప్ కూడా డిఫరెంట్ గా కనిపిస్తోంది. అంతే కాదు ఈ షెడ్యూల్ లో ఎన్నికల ప్రచారానికి సంబంధించిన సీన్స్ షూట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పంచె, పైజామాతో చరణ్ లుక్ డిఫరెంట్ గా ఉంది. అంతే కాదు ఆయన పార్టీ గుర్తు ట్రాక్టర్ కి ఓటు వేయాలని జనాలను రిక్వెస్ట్ చేసే సన్నివేశాలను శంకర్ చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ డిసెంబర్ 25వరకు జరగనున్నట్టు సమాచారం. ఈ ఎపిసోడ్స్ అన్నీ కూడా థియేటర్స్ లో అదిరిపోయే లెవెల్లో ఉండనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో చరణ్ సరసన మరోసారి కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తుండగా.. దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ వంటి పాన్ ఇండియా సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత తండ్రి చిరంజీవి నటించిన ఆచార్యలో నటించినా అది హిట్ కాలేదు. దీంతో ఈసారి ఎలాగైనా సాలీడ్ హిట్ సాధించాలని చూస్తున్నారు. దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమాను వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది చిత్ర బృందం.
Read Also: Shruti Haasan: ఆయనతో వర్క్ చేయడం వేరే లెవల్ అంటున్న శృతిహాసన్.. ఇంతకీ ఆయనెవరు?