Site icon NTV Telugu

Peddi: ‘జిగేలు రాణి’ని మించిపోయేలా ‘పెద్ది’లో స్పెషల్ సాంగ్?

Peddi

Peddi

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ గురించి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఒక భారీ స్పెషల్ సాంగ్ ఉండబోతోందని, దీని కోసం సెట్ కూడా సిద్ధమైందని సమాచారం. గతంలో రామ్ చరణ్ ‘రంగస్థలం’ సినిమాలో ‘జిగేలు రాణి’ పాట ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ ఇంపాక్ట్‌ను మించిపోయేలా ఈ స్పెషల్ సాంగ్‌ను డిజైన్ చేస్తున్నారట. ఈ పాటలో ఒక పవర్‌ఫుల్ ‘హుక్ వర్డ్’ ఉండబోతోంది. అది కూడా పక్కా ఉత్తరాంధ్ర యాసలో ఉండే పదాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది, మాస్ మూమెంట్స్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన జానీ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ వహించబోతున్నారు. చరణ్ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా హై-ఎనర్జీ స్టెప్స్‌ను ఆయన సిద్ధం చేసినట్లు సమాచారం.

Also Read :Active Producers Guild : ఆ థియేటర్లకు మా సినిమాలు ఇచ్చే ప్రసక్తే లేదు !

ఈ సినిమా విడుదల తేదీపై ప్రస్తుతం ఇండస్ట్రీలో భిన్నమైన చర్చలు నడుస్తున్నాయి. కేవలం షూటింగ్ మాత్రమే కాకుండా, OTT స్లాట్ చర్చలు కూడా సినిమా విడుదల తేదీని ప్రభావితం చేసే అవకాశం ఉంది. డిజిటల్ రైట్స్ విషయంలో భారీ డీల్స్ కుదురుతున్న తరుణంలో, సినిమాను ఎప్పుడు థియేటర్లోకి తీసుకురావాలనేది ఆ డీల్స్‌పై కూడా ఆధారపడి ఉండొచ్చని టాక్. ఒకవేళ విడుదల తేదీలో మార్పు ఉన్నా అది ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ‘పెద్ది’ చిత్రానికి సంబంధించి అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అధికారిక ప్రకటన కేవలం ఒకటి రెండు రోజుల్లో రాబోతోంది. చిత్ర యూనిట్ ఒక ప్రెస్ మీట్ ద్వారా కానీ లేదా ఒక అదిరిపోయే పోస్టర్ ద్వారా కానీ సినిమా అప్‌డేట్‌ను ఇవ్వాలని ప్లాన్ చేస్తోంది. మొత్తానికి, ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రామ్ చరణ్ మాస్ అవతార్‌ను చూడాలని మెగా అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ‘జిగేలు రాణి’ రికార్డులను ఈ కొత్త పాట తిరగరాస్తుందో లేదో చూడాలి!

Exit mobile version