నటుడు రామ్ చరణ్ ఇటీవల ఒక వివాహ వేడుకలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు ట్రంప్ జూనియర్‌ను కలిశారు. వీరిద్దరూ కొద్దిసేపు సరదాగా మాట్లాడుకున్నారు. ఈ అరుదైన భేటీకి వేదికైంది ఎన్.ఆర్.ఐ (NRI), ఫార్మా దిగ్గజం రామరాజు మంతెన కుమార్తె నేత్ర మంతెన వివాహం. ఈ పెళ్లి వేడుకకు రామ్ చరణ్‌తో పాటు, గ్లోబల్ సెలబ్రిటీలైన ట్రంప్ జూనియర్, ప్రముఖ నటి, గాయని జెన్నీఫర్ లోపెజ్, అలాగే గాయకుడు జస్టిన్ బీబర్ వంటి హాలీవుడ్ దిగ్గజాలు కూడా హాజరయ్యారు. ఈ వేదికపై రామ్ చరణ్ మరియు ట్రంప్ జూనియర్‌లు కాసేపు ముచ్చటించుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది.
Also Read: Chiranjeevi – Ram Charan : మొన్న చిరంజీవి.. నేడు రామ్ చరణ్.. అదరగొట్టారుగా..
ఫార్మా రంగంలో అగ్రగామి అయిన రామరాజు మంతెన కుమార్తె నేత్ర మంతెన వివాహం రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో ఇటీవల అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు హాజరై సందడి చేశారు. నిజానికి ఈ వేడుకకు టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా, వివాహానికి హాజరైన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు ట్రంప్ జూనియర్తో రామ్ చరణ్ కొద్దిసేపు సరదాగా ముచ్చటించడం వేడుకకే హైలైట్‌గా నిలిచింది.
Also Read: Ram Charan Chikiri : సెంచరీ కొట్టిన చికిరీ..మరో రికార్డు!
సాధారణంగా భారతీయ సెలబ్రిటీలకు, హాలీవుడ్ ప్రముఖులకు మధ్య ఇలాంటి వేదికలు అరుదుగా ఉంటాయి. అయితే నేత్ర మంతెన వివాహానికి హాలీవుడ్ నుంచి కూడా భారీ స్థాయిలో ప్రముఖులు తరలిరావడం విశేషం. పెళ్లి వేదికపై హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ మరియు అమెరికన్ రాజకీయ ప్రముఖుల కలయిక ఈ వివాహాన్ని ఒక ‘గ్లోబల్ ఈవెంట్’గా మార్చింది. ఈ వివాహ వేడుకకు సంబంధించిన విశేషాలు, ప్రముఖుల సందడి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
