NTV Telugu Site icon

Ram Charan: బ్రేకింగ్.. సీఎంను కలిసిన రామ్ చరణ్ దంపతులు

Charan

Charan

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అతని భార్య ఉపాసన కొణిదెల.. మహారాష్ట్ర సీఎం లోక్ నాథ్ షిండేతో భేటీ అయ్యారు. ఆయన ఇంటికి సతిసమేతంగా వెళ్లి.. వారి ఆతిధ్యం స్వీకరించారు. ఈ విషయాన్నీ చరణ్ భార్య ఉపాసన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. మహారాష్ట్ర ప్రజలు ఇచ్చిన ఆతిధ్యానికి కృతజ్ఞతలు చెప్పుకొచ్చింది. ” ప్రియమైన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారూ, శ్రీకాంత్ షిండే గారూ, మరియు చైతన్యవంతమైన మహారాష్ట్ర ప్రజలారా, మీ అసాధారణమైన ఆతిథ్యం మరియు ఆప్యాయతకి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము” అంటూ రాసుకొచ్చింది. ఇక ఈ మధ్య షూటింగ్ కు కొద్దిగా గ్యాప్ ఇచ్చి.. కుటుంబంతో ఆలయాలను తిరుగుతున్న చరణ్ దంపతులు ముంబైలో మహారాష్ట్ర సీఎం లోక్ నాథ్ షిండే ఇంటికి వెళ్లి వారి ఆతిథ్యం స్వీకరించారు.ఇక ఫోటోలో చరణ్, ఉపాసనలకు సీఎం శ్రీకాంత్ షిండే.. పుష్ప గుచ్చం ఇస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.

ఇక చరణ్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఏ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ ను రిలీజ్ చేస్తాము అని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కానీ, కొన్ని కారణాల వలన ఆ సాంగ్ ను రిలీజ్ చేయలేదు. దీంతో అభిమానులు చాలా డిజప్పాయింట్ లో ఉన్నారు. ఇంకోపక్క మెగా ప్రిన్సెస్ క్లింకారతో చరణ్ ఎక్కువ సమయం గడుపుతున్నాడు.

Show comments