Site icon NTV Telugu

Ram Charan: లండన్‌లో రామ్‌చరణ్‌ను కలిసిన కామన్‌వెల్త్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌..

Ram Charan

Ram Charan

హీరో రామ్‌చరణ్ ప్రస్తుతం లండన్‌ పర్యటనలో ఉన్నారు. లండన్‌లోని ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్‌లో రామ్‌చరణ్ మైనపు విగ్రహం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి రామ్‌చరణ్ లండన్‌కు వెళ్లారు. ఈ క్రమంలో మాజీ బాక్సర్‌ జూలియస్‌ ఫ్రాన్సిస్‌ ఆయన్ను మంగళవారం కలిశారు. బాక్సింగ్‌ బెల్ట్‌ను తన భుజంపై వేయమని చరణ్‌ను జూలియస్‌ కోరారు. వీరి కలయికకు సంబంధిత ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. వాస్తవానికి జూలియస్‌ బ్రిటిష్‌ హెవీ వెయిట్‌ ఛాంపియన్‌గా 5 సార్లు, కామన్వెల్త్‌ ఛాంపియన్‌గా 4 సార్లు గెలుపొందారు.

READ MORE: WTC Final- IPL 2025: డబ్ల్యూటీసీ ఫైనల్ ఎఫెక్ట్.. ఐపీఎల్‌లో ఆ జట్లకు బిగ్ షాక్!

కాగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ మైనపు విగ్రహాన్ని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఇటీవల లండన్ లో చరణ్ స్వయంగా తన చేతుల మీదుగా ఈ విగ్రహాన్ని లాంచ్ చేసారు. ఈ కార్యక్రమానికి చరణ్‌తో పాటు భార్య ఉపాసన, కుమార్తె క్లీంకార, తల్లిదండ్రులు చిరంజీవి – సురేఖ హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

READ MORE: Five Students Missing: కడపలో విషాదం.. ఈతకు వెళ్లి ఐదుగురు విద్యార్థులు గల్లంతు..!

Exit mobile version