NTV Telugu Site icon

Salaar 2 : ప్రభాస్ కు జోడిగా రామ్ చరణ్ హీరోయిన్..డైరెక్టర్ ప్లాన్ అదిరింది..

Salaar 2 Update

Salaar 2 Update

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం ఆయన చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి.. గత ఏడాది చివరన సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సాలిడ్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. ఇప్పుడు కల్కి 2898 AD, రాజా సాబ్ ఈ రెండు సినిమాలు పూర్తి చేశాక సలార్ 2 ని సెట్స్ మీదకు తీసుకెళ్తాడని తెలుస్తుంది..

ఇక ఈ సినిమాతో పాటుగా సందీప్ వంగా దర్శకత్వం లో రాబోతున్న స్పిరిట్ సినిమాను కూడా త్వరగా ఫినిష్ చెయ్యాలనే ఆలోచనలో డార్లింగ్ ఉన్నట్లు తెలుస్తుంది.. సలార్ 1 సీజ్ ఫైర్ సత్తా చాటగా సలార్ 2 శౌర్యాంగ పర్వం కూడా అంచనాలను తగినట్టుగా ప్రశాంత్ నీల్ స్కెచ్ వేస్తున్నాడు.. అయితే మొదటి పార్ట్ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది.. ఇప్పుడు రాబోతున్న సీక్వెల్ సినిమాలో శృతిహాసన్ తో పాటుగా మరో హీరోయిన్ ను కూడా దించబోతున్నారని సమాచారం..

సలార్ 2 లో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. వార్ 2, డాన్ 3 సినిమాల్లో ఛాన్స్ అందుకున్న కియరా సౌత్ లో గేం చేంజర్ సినిమాలో నటిస్తుంది.. ఈ వార్తల్లో నిజమేంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. ఈ విషయం పై క్లారిటి రావాలంటే కొద్ది రోజులు వెయిట్ చెయ్యాల్సిందే..

Show comments