Game Changer : మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటేడ్ పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ థియేటర్లో రిలీజ్ అయింది. మావెరిక్ దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని సాలిడ్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కించారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ బాక్సాఫీస్ దగ్గర కుమ్మేసింది. ఫస్డ్ డే ఊహించని వసూళ్లు సాధించింది. వరల్డ్ వైడ్‌గా ఏకంగా రూ. 186 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టుగా మేకర్స్ అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేశారు. మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ డే పోస్టర్స్ పరంగా చూస్తే గేమ్ ఛేంజర్ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర హెయెస్ట్ గ్రాస్ వసూలు చేసిన సినిమాల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. చరణ్ నుంచి ఆర్ఆర్ఆర్, ఆచార్య తర్వాత వస్తున్న సోలో సినిమా ఇది కావడంతో దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్ ఇప్పటికే భారీగా బుక్కైన సంగతి తెలిసిందే. దీనిని బట్టే ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఉన్నారన్న సంగతి అర్థం అవుతుంది.
Read Also:Maharashtra: పండగ వేళ మహా విషాదం.. ఫోన్ కొనలేదని కొడుకు ఆత్మహత్య.. ఆవేదనతో తండ్రి కూడా సూసైడ్
ఇది ఇలా ఉంటే గేమ్ ఛేంజర్ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది. గేమ్ ఛేంజర్ సినిమా స్పెషల్ షోలను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు హోంశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రేపటి నుంచి మార్నింగ్ స్పెషల్ షోలు నిలిచిపోనున్నాయి. టికెట్ ధరల పెంపు, ప్రత్యేక ప్రదర్శనలపై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. ఈ సందర్భంగా బెనిఫిట్ షోలను రద్దు చేసి స్పెషల్ షోలకు మాత్రం అనుమతి ఇవ్వడాన్ని కోర్టు తప్పుపట్టింది. దీనిపై పునరాలోచించాలని సూచించింది. దీంతో ప్రభుత్వం స్పెషల్ షోలను రద్దు చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో మార్నింగ్ స్పెషల్ షో రద్దు కానున్నాయి.
Read Also:Team India: ఇంగ్లాండ్తో టీ20 సిరీస్కి భారత జట్టు ఎంపిక.. తెలుగు కుర్రాళ్లకు చోటు