NTV Telugu Site icon

Game Changer : కింగ్ మాదిరి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్

New Project (76)

New Project (76)

Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ప్రముఖ దర్శకుడు శంకర్ కలిసి నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా వచ్చే ఏడాది జనవరి 10న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర యూనిట్ చాలా కాలం క్రితమే ప్రమోషన్స్ ప్రారంభించింది. రోజుల తరబడి వరుసగా అప్‌డేట్స్ ఇస్తూ హైప్ పెంచుతోంది. టీజర్‌తో పాటు ఇప్పటికే మూడు పాటలు విడుదల అయిన విషయం తెలిసిందే.

Read Also:Huge Discount On iPhone 15 Plus: ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఆ ఫోన్‌పై బిగ్ డిస్కౌంట్ డీల్స్

అమెరికాలోని డల్లాస్‌లో ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మెగా ఈవెంట్ కోసం హీరో రామ్ చరణ్ అమెరికాకు బయలుదేరి వెళ్లారు. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో అమెరికాలోని తెలుగు వారిని పాల్గొనమని ఆహ్వానిస్తూ గురువారం చెర్రీ ఒక వీడియో సందేశాన్ని కూడా పంచుకున్నారు. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ డల్లాస్‌లోని కర్టిస్ కల్వెల్ సెంటర్‌లో, 4999 నోమన్ ఫారెస్ట్, గార్లాండ్ TX 75040లో జరుగుతుంది. పుష్ప 2తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు సుకుమార్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. ఈ ఈవెంట్ లో రామ్ చరణ్ స్పెషల్ ఎంట్రీ అదిరిపోయింది. ఆయన ఓ కింగ్ మాదిరి ఎంట్రీ ఇచ్చాడని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Read Also:Sanjay Raut: బీఎంసీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తాం.. మహా వికాస్‌ అఘాడీలో లుకలుకలు

‘గేమ్ ఛేంజర్’లో రామ్ చరణ్ రెండు శక్తివంతమైన పాత్రల్లో కనిపించనున్నారు. చెర్రీ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ చిత్రానికి కథను అందించారు. ఎస్. జె సూర్య, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర, అంజలి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.