Ram Charan Pet Dog and Daughter klinkaara Photo Goes Viral: టాలీవుడ్ మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్’కి మూగ జీవాలు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్నప్పటి నుంచి చరణ్ గుర్రాలను పెంచుకునేవారు. వాటి మీద స్వారీ చేస్తూ.. హార్స్ రైడర్‌గా కూడా నిలిచారు. ప్రస్తుతం ఆయన వద్ద చాలానే గుర్రాలు ఉన్నాయి. ఇక ఇటీవలి కాలంలో ‘రైమ్’ అనే కుక్కను చరణ్ పెంచుకుంటున్నారు. అదంటే ఆయనకు చాలా ఇష్టం. చరణ్ ఎక్కడకి వెళ్లినా.. రైమ్ పక్కన ఉండాల్సిందే. మూవీ ప్రొమోషన్స్, ఇంటర్వ్యూస్, ట్రిప్స్ ఎక్కడికెళ్లినా చరణ్ పక్కన రైమ్ ఉంటుంది. ఇందుకు సంబందించిన ఫొటోస్ నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉంటాయి.
రామ్ చరణ్‌కి బిడ్డ పుట్టినా కూడా రైమ్‌ని వదలడం లేదు. అదేవిధంగా రైమ్ కూడా చరణ్ కూతురిని క్షణం కూడా వదలడం లేదు. రాత్రి, పగలు కాపలా కాస్తుంది. ఉయ్యాలలో ఉన్న మెగా ప్రిన్సెస్ క్లింకారను రైమ్ నిత్యం చూస్తూనే ఉంది. ఇందుకు సంబందించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆల్‌వేస్ రైమ్ (alwaysrhyme) అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో క్లింకార, రైమ్ ఫొటో ఒకటి పోస్ట్ చేశారు. ‘నైట్ డ్యూటీ చేస్తున్నా.. నా చెల్లెలిపై ఓ కన్నేసి ఉంచాను’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఈఫొటో నెట్టింట వైరల్ అయింది. ఈ ఫొటోపై మెగా ఫాన్స్ అందరూ లైకుల, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Also Read: Dwayne Bravo Six: డ్వేన్ బ్రావో భారీ సిక్సర్.. వీడియో చూస్తే వావ్ అనకుండా ఉండలేరు!
ఇటీవల రామ్ చరణ్, ఉపాసన కొణిదెల దంపతులు పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆ పాపకు క్లింకార అని పేరు పెట్టారు. పాపకు నాన్నమ్మ, తాతయ్యలతో మంచి బంధం ఏర్పడాలన్న ఉద్దేశ్యంతో మెగాస్టార్ చిరంజీవి ఇంటికి చరణ్ దంపతులు షిఫ్ట్ అయ్యారు. ఇక మెగా ప్రిన్సెస్ కోసం ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు. క్లీంకార కోసం ప్రముఖ ఆర్కిటెక్ట్ పవిత్ర రాజారామ్ నేతృత్వంలో రూంను ఉపాసన డిజైన్ చేయించారు. ఆ గదిలోనే రైమ్ కూడా చక్కర్లు కొడుతోంది. ఇది ఫ్రెంచ్ బార్బేట్ జాతికి చెందిన కుక్క పిల్ల. ఈ జాతి కుక్క పిల్ల లక్ష పాతికవేల నుంచి రెండున్నర లక్షల వరకు ఉంది.