గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. ఇప్పుడు కుస్తీ మే సవాల్ అంటున్నాడు. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో ఆర్సీ 16 ప్రాజెక్ట్ చేస్తున్నాడు చరణ్. ఈ సినిమా చరణ్ కెరీర్లో ఓ మైలు రాయిగా నిలిచిపోతుందని ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో ఆర్సీ 16 రూపొందుతోంది. ఈ సినిమాలో పలు క్రీడల ప్రాధన్యత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. క్రికెట్, కుస్తీతో పాటు ఇంకొన్ని స్పోర్ట్స్ కథలో కీ రోల్ పోషిస్తాయని అంటున్నారు. ఇటీవలె రాత్రిపూట హైదరాబాద్‌లో క్రికెట్‌కు సంబంధించిన పలు కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ప్రస్తుతం షూటింగ్‌కు చిన్న బ్రేక్ ఇచ్చారు. ఇక నెక్స్ట్ షెడ్యూల్‌లో కుస్తీకి సంబంధించిన సీన్స్ షూటింగ్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. కుస్తీ పట్టు పట్టాలంటే చరణ్ కాస్త బాడీ బిల్డింగ్ చేయాల్సి ఉంటుంది.
Prabhas: ప్రభాస్-హోంబలే ఫిల్మ్స్.. ముగ్గురు డైరెక్టర్స్ లాక్?
లేటెస్ట్ చరణ్ ఫోటోలు బయటికి రాగా.. అందులో సరికొత్తగా మేకోవర్ అయినట్టుగా కనిపించాడు. రామ్ చరణ్ భార్య ఉపాసన సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో.. తాజాగా ఉపాసన తన ఫ్యామిలీతో కలిసి దిగిన ఓ ఫోటోను నెట్టింట షేర్ చేసింది. ఇందులో.. రామ్ చరణ్ కొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు. ఫుల్‌గా గడ్డం పెంచి, రఫ్ లుక్‌లో కాస్త బొద్దుగా కనిపిస్తున్నాడు. ఎప్పుడు స్లిమ్‌గా ఉండే చరణ్ కాస్త లావుగా కనిపించడంతో.. ఆర్సీ 16లో కుస్తీ పట్టు పట్టడానికి రెడీ అయ్యాడనే చెప్పాలి. ఖచ్చితంగా చరణ్ పట్టే కుస్తీ పట్టుకి బాక్సాఫీస్‌కు ఊపిరి ఆడదని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. మరి ఆర్సీ16లో చరణ్ ఎలా కనిపిస్తాడో చూడాలి.