Ram Charan: రామ్ చరణ్‌కి అరుదైన గౌరవం.. మొదటి భారత సెలబ్రిటీగా!
- రామ్ చరణ్‌కి అరుదైన గౌరవం
- నాటు నాటుకు డ్యాన్స్ చేయడానికి సిద్ధంగా ఉండండి
- ఆగస్టు 15 నుంచి 25 వరకు ఫెస్టివల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Charan named the Guest of Honour for IFFM 2024: ‘గ్లోబల్ స్టార్’ రామ్ చరణ్‌కి అరుదైన గౌరవం దక్కింది. ‘ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్’ 15వ ఎడిషన్‌లో చరణ్ పాల్గొననున్నారు. అతిథిగా వెళ్లడమే కాకుండా.. భారత సినిమాకి చేసిన సేవలకు గాను ‘ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ అంబాసిడర్’ అవార్డును అందుకోనున్నారు. ఈ విషయాన్ని ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ అవార్డు అందుకోనున్న మొదటి భారతీయ సెలబ్రిటీ మనోడే కావడం విశేషం.
‘అందరికీ ఓ శుభవార్త. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ 2024కి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వస్తున్నారు. నాటు నాటుకు డ్యాన్స్ చేయడానికి సిద్ధంగా ఉండండి’ అని ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ పేర్కొంది. ఈ విషయంపై రామ్ చరణ్ స్పందిస్తూ.. ఆనందం వ్యక్తం చేశారు. ‘ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ 2024లో నేను కూడా ఒక భాగమైనందుకు నేను సంతోషిస్తున్నాను. ఆర్ఆర్ఆర్ విజయం చిన్నది కాదు.. విశ్వవ్యాప్తం. ఈ క్షణాన్ని మెల్‌బోర్న్ ఆడియెన్స్‌తో షేర్ చేసుకోవడానికి వెయిట్ చేస్తున్నా’ అంటూ చరణ్ తెలిపారు. విక్టోరియన్ ప్రభుత్వం ప్రతి ఏడాది ఈ ఫెస్టివల్‌ను నిర్వహిస్తుంది. ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి 25 వరకు ఫెస్టివల్ జరగనుంది.
Also Read
Are you excited or ARE YOU EXCITED? Because Global Star Ram Charan is coming to the Indian Film Festival Of Melbourne 2024. Are we ready to dance to Naatu Naatu? pic.twitter.com/kFy7Z5zSdA
— Indian Film Festival of Melbourne (@IFFMelb) July 19, 2024
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్‌తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!