రకుల్ ప్రీత్ సింగ్ కు పెళ్లి అయిపోయిందా?.. ఎస్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో కోడై కూస్తుంది.. ఈ అమ్మడుకు సౌత్, నార్త్ లో ఫ్యాన్స్ ఉన్నారు.. తెలుగులో వెంకటాద్రి ఎక్సప్రెస్ సినిమాతో పరిచయం అయ్యింది.. ఆ సినిమా మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.. దాంతో ఈ అమ్మడుకు అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి.. కొద్ది రోజుల్లోనే వరుస హిట్ సినిమాలతో స్టార్ హీరోయిన్ అయ్యింది.. స్టార్ హీరోలందరి సరసన మెరిసింది.. అయితే ప్రస్తుతం తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలివుడ్ కు చెక్కెసింది..అక్కడ వరుస అవకాశాలను అందుకుంటుంది..
అయితే బాలీవుడ్లో ప్రస్తుతం కొన్ని సినిమాల్లో నటిస్తున్నప్పటికీ ఆమెకు మంచి ఫెమ్ రాలేదు. కానీ పర్సనల్ విషయాల వల్ల బాలీవుడ్ లో చాలా వైరల్ గా మారుతుంది. ఎందుకంటే ఈమె బాలీవుడ్ నిర్మాత,నటుడు జాకీభగ్నానితో గత కొద్ది రోజుల నుండి రిలేషన్ లో ఉంది. వీరిద్దరూ ప్రేమలో పడ్డారని, త్వరలోనే పెళ్లి చేసుకుంటారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా వీరి పెళ్లి వార్తలపై స్పందించిన రకుల్ ప్రీత్ సింగ్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది.
రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. మా ప్రేమ విషయాన్ని దాచడానికి మేమేం ఇంకా చిన్న పిల్లలం కాదు. అందులో మాకేం భయం లేదు. మేము దీన్ని నిర్భయంగా బయటపెట్టాం. మా ప్రేమ విషయాన్ని ఒప్పుకున్నా కూడా చాలామంది మేం సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నామని వార్తలు వైరల్ చేస్తున్నారు.. నిజానిజాలు తెలుసుకోకుండా ఇలా చెయ్యడం తప్పు.. అయిన వాళ్ళు పాపులర్ అవ్వడానికి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు.. ఇప్పటికే గత సంవత్సరం ఆగస్టులో, అలాగే ఈ ఏడాది ఫిబ్రవరిలో సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నామని వార్తలు వైరల్ చేశారు. ఇలా ఇప్పటికే సోషల్ మీడియా మాకు రెండుసార్లు సీక్రెట్ గా పెళ్లి చేసేసింది.. అంటూ రకుల్ చెప్పుకొచ్చింది.. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ ఇండియన్ 2 సినిమాలో నటిస్తుంది..