రకుల్ ప్రీత్ సింగ్ గురించి అందరికి తెలుసు.. ఒకప్పుడు వరుస హిట్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉండేది.. ఆ తర్వాత తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో బాలివుడ్ కు వెళ్లింది..ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా రాణిస్తోంది. ఇక ఈ మధ్యకాలంలో ఎక్కువగా తెలుగులో కనిపించడం లేదు అని చెప్పుకోవచ్చు.. అందుకు కారణం ప్రముఖ బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నాని తో లవ్ ఎఫైర్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి..
ఇదిలా ఉండగా.. ఇటీవల ఈ అమ్మడు ఓ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సంగతి తెలిసిందే.. అందులో భాగంగా.. తన గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది..రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. నేను హీరోయిన్ అవ్వకుంటే కచ్చితంగా ఎంబీఏ (ఫ్యాషన్ ) చేసేదాన్ని. నాకు 18 సంవత్సరాల వయసులోనే సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. ఇక మాది ఆర్మీ ఫ్యామిలీ కాబట్టి నేను చిన్నప్పటినుండే చాలా డిసిప్లేన్ గా ఉండడం నేర్చుకున్నాను.. అందుకే మొదట్లో ఒప్పుకోలేదు.. ఆ తర్వాత నా ఇష్టాన్ని కాదనలేక ఒప్పుకున్నారని రకుల్ చెప్పింది..
అయితే, హీరోయిన్ అవ్వాలనే కోరిక ఉంటే సరిపోదు.. అందుకోసం ముందుగా మోడలింగ్ కూడా చెయ్యాలి..మోడలింగ్ చేస్తేనే మనకు ఎంతో కొంత గుర్తింపు వస్తుంది. మిస్ ఇండియా వంటి కాంపిటీషన్లో కూడా పాల్గొనాలి. ఇలా అయితే సినిమాల్లో అవకాశాలు తొందరగా వస్తాయి అంటూ రకుల్ చెప్పుకొచ్చింది.. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.. ఒకవైపు వరుస సినిమాలు చేస్తున్న మరోవైపు సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్లతో హీటు పెంచుతుంది. ఇక రకుల్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. మరి పెళ్లి డేట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తుందో చూడాలి..