Rakul Preet Singh: మధ్య వయసు గల వ్యక్తితో రొమాన్స్.. రకుల్ పోస్ట్ వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rakul Preet Singh Joins in DDPD 2 Shooting: ఇటీవలే తన బాయ్‌ఫ్రెండ్, నిర్మాత జాకీ భగ్నానిని వివాహం చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్.. ఫుల్ జోష్‌లో ఉన్నారు. సౌత్, నార్త్ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. రకుల్ కీలక పాత్రలో నటించిన ఇండియన్ 2 విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఆమె మరో కొత్త సినిమా సెట్స్‌లోకి అడుగుపెట్టారు. బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అజయ్ దేవగణ్, రకుల్ జంటగా నటిస్తున్న సినిమా ‘దే దే ప్యార్ దే 2’. తాజాగా ఈ సినిమా చిత్రీకరణలో రకుల్ పాల్గొన్నారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టా వేదికగా తెలిపారు.
‘నా ఫేవరెట్ సినిమా దే దే ప్యార్ దే 2 సెట్స్‌లో జాయిన్ అయ్యాను. చాలా హ్యాపీగా ఉంది’ అని రకుల్ ప్రీత్ సింగ్ ఇన్‌స్టాలో పేర్కొన్నారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2019లో విడుదలైన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘దే దే ప్యార్ దే’కి కొనసాగింపుగా ఈ సినిమా వస్తోంది. సీక్వెల్‌కు అకివ్ అలీకి బదులుగా అన్షుల్ శర్మ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మధ్య వయసు గల ఆశిష్ అనే వ్యక్తి 20 ఏళ్ల ఆయేషా ప్రేమ కోసం పరితపిస్తుంటాడు. వయసుతో సంబంధం లేకుండా మొదలైన వీరిద్దరి ప్రేమ.. గెలిచిందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
Also Read
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
- Sunil Gavaskar: రహానే రిటైర్మెంట్పై గవాస్కర్ భావోద్వేగ వ్యాఖ్యలు.. దక్కాల్సిన గుర్తింపు ఎప్పుడూ దక్కలేదు..!
- MK Stalin: 'డమ్మీ సీఎం.. రీల్స్ క్రియేటర్'.. విజయ్‌పై స్టాలిన్ తీవ్ర విమర్శలు
- New Cricket Stadium: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. 90 ఎకరాల్లో, రూ.633 కోట్లతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
Also Read: Saripodhaa Sanivaaram: హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్.. భారీ సెట్‌లో యాక్షన్ సీక్వెన్స్!
దే దే ప్యార్ దే 2ను భూషణ్ కుమార్, లవ్‌రంజన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది మే 1న విడుదల కానుంది. ఇందులో అనిల్ కపూర్, మాధవన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తొలి భాగంలో నటించిన టబు సీక్వెల్‌లోనూ నటిస్తారా? లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఈ సినిమా చిత్రీకరణ తాజాగా ముంబైలో ప్రారంభమైంది.
తాజావార్తలు
-
ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
-
Sunil Gavaskar: రహానే రిటైర్మెంట్పై గవాస్కర్ భావోద్వేగ వ్యాఖ్యలు.. దక్కాల్సిన గుర్తింపు ఎప్పుడూ దక్కలేదు..!
-
MK Stalin: ‘డమ్మీ సీఎం.. రీల్స్ క్రియేటర్’.. విజయ్‌పై స్టాలిన్ తీవ్ర విమర్శలు
-
New Cricket Stadium: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. 90 ఎకరాల్లో, రూ.633 కోట్లతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
-
Pakistan: పాకిస్తాన్లో తిరుగుబాటు సంకేతాలు.. షరీఫ్, జర్దారీ పదవులకు ముప్పు..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!