Site icon NTV Telugu

Rakul Preet Singh: డబ్బులిచ్చి మరీ బురద చల్లుతున్నారు.. పీఆర్ పై నిప్పులు చెరిగిన రకుల్

Rakul Pretsing

Rakul Pretsing

సినీ ఇండస్ట్రీలో పబ్లిసిటీ అనేది కామన్. కానీ ఈ మధ్యకాలంలో పీఆర్ (Public Relations) పేరుతో జరుగుతున్న కొన్ని పనులు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కు తీవ్ర ఆగ్రహాన్నికి గురిచేశాయి. బాలీవుడ్‌లో నెగెటివ్ పీఆర్ సంస్కృతి పెరిగిపోతోందని, ఒకరి మీద ఒకరు డబ్బులిచ్చి మరీ బురద చల్లుకుంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read : Dhurandhar 2 : ‘ధురంధర్ 2’ ఓటీటీ డీల్ జియో హాట్‌స్టార్‌కే.. ఆ మార్పు వెనుక అసలు కథేంటి?

తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రకుల్ మాట్లాడుతూ.. ‘బాలీవుడ్‌లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తమ పబ్లిసిటీ కోసం కాకుండా, పక్కవారిని తొక్కేయడానికి డబ్బులిచ్చి నెగెటివిటీని ప్రచారం చేయిస్తున్నారు. ఇంతలా ఇతరుల గురించి నెగెటివ్‌గా మాట్లాడించే వాళ్లకు అసలు నిద్ర ఎలా పడుతుంది? వాళ్లకు మనస్సాక్షి ఉండదా? అని నాకు అనిపిస్తుంటుంది. ఇలాంటి వాళ్లకు ఏదో ఒకరోజు దెబ్బ తప్పదు’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అలాగే తన కెరీర్ గురించి మాట్లాడుతూ.. ‘నేను ఎవరి సాయం లేకుండా నా కష్టంతోనే ఈ స్థాయికి వచ్చాను. నా పనికి తగ్గ ఫలితం నాకు దక్కుతుంది. నన్ను నేను ప్రమోట్ చేసుకోవడానికి నాకు పీఆర్ టీమ్‌లు అవసరం లేదు’ అని స్పష్టం చేసింది. కేవలం టాలెంట్ మాత్రమే ఇండస్ట్రీలో నిలబెడుతుందని ఆమె నొక్కి చెప్పారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఒకరిపై ఒకరు చేసే నెగెటివ్ ప్రచారం గురించి రకుల్ ఇలా ఓపెన్‌గా మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది.

Exit mobile version