Site icon NTV Telugu

Rashmika Deep Fake Video: రష్మిక డీప్ ఫేక్ వీడియో.. మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి ఏమన్నాడంటే.. ?

Rakshith

Rakshith

Rashmika Deep Fake Video: నేషనల్ క్రష్ రష్మిక డీప్ ఫేక్ వీడియో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం.లేదు AI టెక్నాలజీ వచ్చాకా ప్రతి ఒక్కరు ఇలాంటి వీడియోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేసి శునకానందం పొందుతున్నారు. ఈ వీడియోల వలన ఎంతమంది సఫర్ అవుతున్నారో వారికి ఏ మాత్రం తెలియడం లేదు. ఇక రష్మికకు సపోర్ట్ గా అభిమానులతో పాటు ఇండస్ట్రీ మొత్తం నిలిచింది. తాజాగా రష్మిక మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి సైతం ఈ ఘటనపై స్పందించాడు. రక్షిత్ శెట్టి నటించిన చిత్రం సప్తసాగరాలు దాటి సైడ్ B. నవంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన రక్షిత్.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో రష్మిక డీప్ ఫేక్ వీడియో గురించి మాట్లాడాడు.

Nana Patekar: కావాలని కొట్టి.. ఇప్పుడు కవర్ చేసుకోవడానికి కబుర్లు చెప్తున్నావా.. ?

“డీప్ ఫేక్ వీడియోలు క్రియేట్ చేయకుండా ప్రభుత్వాలు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలి. ముందు ముందు ఇలాంటి తప్పులు జరగకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎలాంటి సాఫ్ట్ వేర్ క్రియేట్ చేసినా దానికంటూ ఓకే లైసెన్స్ ఉండేలా చూసుకోవాలి. అది లిమిట్ దాటినప్పుడు వెంటనే అడ్డుకోనేలా ఉండాలి. ఆలాంటి రూల్స్ వచ్చినప్పుడు ఇలాంటి వాటికి చెక్ పెట్టొచ్చు. అలా చేయలేకపోతే ఇలాంటి ఘటనలు ముందు ముందు ఇంకా జరుగుతూనే ఉన్తయి. రష్మిక.. ఎంతో మంచి భవిష్యత్తును కలలు కంటున్న అమ్మాయి” అని పాజిటివ్ గా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version