NTV Telugu Site icon

Rakshana Trailer: పోలీస్ గా అదరగొట్టిన పాయల్ రాజ్ పుత్..

Rakshna

Rakshna

‘మంగళవారం’ సినిమాతో భారీ హిట్ ను సొంతం చేసుకున్న పాయల్ రాజ్ పుత్ ఇప్పుడు మరోసారి ‘రక్షణ’ అంటూ ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాగా ఈ సినిమా చిత్రీకరించబడింది. పాయల్ రాజ్ పుత్ మెయిన్ రోల్ లో నటించగా.. రాజీవ్ కనకాల, మానస్, రోషన్ లాంటి ప్రముఖులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో నటించారు. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ గా ఈ సినిమాను చిత్రీకరించారు. లేడీ పోలీస్ ఆఫీసర్ గా పాయల్ రాజ్ పుత్ సినిమాలో కనిపించబోతోంది. ఈ సినిమా నుండి ఇదివరకే టీజర్ రిలీజ్ అయ్యింది. ఇక తాజాగా రిలిజ్ అయిన ట్రైలర్ లో మంచి ఆసక్తిని నెలకొల్పే విధంగా కనపడబోతోంది.

Dinesh Karthik: క్రికెట్ కి గుడ్ బై చెప్పిన దినేశ్ కార్తిక్

హరిప్రియ క్రియేషన్స్ బ్యానర్ పై ప్ర‌ణ‌దీప్ ఠాకోర్ సినిమాను దర్శకత్వం చేస్తూ నిర్మిస్తున్నాడు. ఇక ట్రైలర్ లో హీరోయిన్ పాయల్ ఓ కేసు డీల్ చేయడానికి చాలా కష్టపడుతున్నట్లుగా కనబడుతుంది. ట్రైలర్ మొదట్లో పోలీస్ గా ప్రమాణం చేస్తూ చెప్పిన మాటలు చివర్లో క్రైం ఫ్రీ సిటీ కావాలి అనేది రికార్డ్స్ లోనా రియాలిటీలోనా అంటూ ప్రశ్నించే డైలాగ్.. ఇలా యాక్షన్ సీక్వెన్స్ లో కూడా పాయల్ అదరగొట్టిందని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ట్రైలర్ ఓసారి వీక్షించండి.

Indian 2 Juke Box: కమల్ హాసన్, శంకర్‌ల ‘ఇండియన్ 2 ‘ జ్యూక్‌బాక్స్ వచ్చేసిందోచ్..

Show comments