Raksha Bandhan 2024: ఇవాళ ఆగస్టు 19న దేశవ్యాప్తంగా రక్షా పౌర్ణమిని ఘనంగా జరుపుకుంటున్నాం. ఈసారి రక్షాబంధన్ చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే.. ఈసారి రక్షాబంధన్ శ్రావణ సోమవారం నాడు రావడం ఒక విశేషం అయితే.. రక్షాబంధన్ రోజు ఏడు విశేష శుభయోగాలు ఏర్పడుతున్నాయి. రాఖీ పండుగ నాడు రవియోగం, శశరాజయోగం, బుధాదిత్య యోగం, శోభనయోగం, సర్వార్ధ సిద్ధి యోగం, శుక్రాదిత్య యోగం, లక్ష్మీనారాయణ యోగం రక్షాబంధనం నాడు ఏర్పడతాయి. అన్న చెల్లెల్ల బంధానికి ప్రతీకగా చెప్పబడే రక్షాబంధన్ రోజున, తోడబుట్టిన జీవితాల్లో అపారమైన ఆనందం, శ్రేయస్సు తీసుకురావడానికి కొన్ని పనులు చేయాలని చెబుతారు.రాఖీ పండుగకు సోదరులకు రాఖీ కట్టడం, మిఠాయిలు తినిపిస్తే సరిపోతుందని చాలా మంది అనుకుంటారు. కానీ.. రాఖీ పండుగ నాడు కచ్చితంగా పాటించాల్సిన కొన్ని నియమాలు ఉన్నాయి. వారి గురించి అందరూ తెలుసుకోవాలి.
Read also: Heavy Vehicles: ఉదయం 7 గంటల తర్వాత సిటీలోకి భారీ వాహనాలు నో ఎంట్రీ..
రాఖీ పండుగ నాడు అన్నదమ్ములకు రాఖీ కట్టే కార్యక్రమం చాలా నియమాలతో జరగాలి. వినాయక చవితి, దసరా పండుగలను ఎలా జరుపుకుంటామో, అదే నియమ నిబంధనలతో రాఖీ పండుగను జరుపుకోవాలి. రాఖీ కట్టే అమ్మాయిలు తెల్లవారుజామున నిద్రలేచి తల స్నానం చేసి రాఖీ కట్టే ముందు అన్నదమ్ములను కూర్చోబెట్టి రాఖీ కట్టడం చాలా మంచిది. సోదరుడు తూర్పు వైపు కాకుండా ఉత్తరం వైపు ఉండేలా కూర్చొని రాఖీ కట్టాలి. పొరపాటున కూడా దక్షిణ దిశలో కూర్చోవద్దు. దక్షిణ దిక్కున కూర్చుని రాఖీ కడితే ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. అన్న, తమ్ములు రాఖీలు కట్టే ముందు దేవుడికి నమస్కరించాలి. వినాయకుడి ఫోటో లేదా విగ్రహానికి బొట్టు పెట్టి ఆ తరువాత సోదరులకు రాఖీ కట్టాలి. సోదరులకు కుంకుమ బొట్టు పెట్టి హారతి ఇచ్చి రాఖీ కట్టాలి. ఆ తర్వాత మిఠాయి తినిపించాలి. అంతేకాదు రాఖీ కట్టేటప్పుడు అన్నదమ్ములు శ్లోకం పఠించి రాఖీ కట్టాలి. “యేన బద్దో బలీ రాజా దానవేంద్రో మహాబల తేన త్వామభి బధ్నామి రక్షమాచల మాచల” అనే మంత్రాన్ని పఠించి రాఖీ కట్టడం మంచిది.
రాఖీని ఎన్ని రోజులు ఉంచుకోవాలి.. నియమాలు ఏమిటి?
