Raksha Bandhan Festival 2023: భారతీయులు ఎంతో ఘనంగా జరుపుకునే రక్షాబంధన్ వేడుకలకు సమయం ఆసన్నమైంది. ఈ పండుగ అన్నా చెల్లె, తమ్ముడు అక్కల మధ్య బంధాన్ని, అనురాగాన్ని, ప్రేమను తెలుపుతుంది. ఈ పండుగలో అక్కా, చెల్లెల్లు అన్నలు, తమ్ముల మణికట్టుకు రాఖీలు కడతారు. రాఖీ వారి దీర్ఘాయుష్షు, సంతోషాన్ని సూచిస్తుంది. అలాగే అన్నలు చెల్లెల్లకు బహుమతులు ఇస్తూ ఆమెకు ఎప్పుడూ అండగా, రక్షణగా ఉంటానని మాటిస్తారు. ఈ ఏడాది రాఖీ రోజున తోబుట్టువులంతా వారి సోదరులకు రాఖీలు కట్టాలని ఏర్పాట్లు చేసుకుంటునన్నారు. అయితే ఈ ఏడాది రాఖీ పండుగను జరుపుకునే విషయంలో ఓ సమస్య వచ్చి పడింది. ఏ రోజున రాఖీ పండుగ జరుపుకోవాలి.. ఆగస్టు 30న లేక 31వ తేదీనా.. ఏ రోజు జరుపుకోవాలనే విషయంపై సందిగ్ధత ఏర్పడింది.
Read Also: Chandrayaan-3: శివశక్తి పాయింట్ చుట్టూ ప్రజ్ఞాన్ రోవర్ చక్కర్లు.. వీడియోను షేర్ చేసిన ఇస్రో
సాధారంగా ఈ పండుగను ‘రాఖీ లేదా రక్షా బంధన్’ అనే పేరుతో పిలుస్తారు. రక్షా బంధన్.. ప్రతి ఏడాది శ్రావణ మాసం పూర్ణిమ తిథి నాడు వస్తుంది. ఈ పండుగ రోజున సోదరీమణులు.. సోదరుల శ్రేయస్సు, దీర్ఘాయువు కోరుతూ.. వారి సోదరుల మణికట్టు చుట్టూ రాఖీలను కడతారు. హిందూ క్యాలెండర్ ప్రకారం.. రక్షా బంధన్ ప్రతి ఏడాది పౌర్ణమి నాడు జరుపుకుంటారు. ఈ సారి రక్షా బంధన్ పండుగను భద్రకాలం కారణంగా ఆగస్టు 30, 31 తేదీన రెండు రోజుల పాటు జరుపుకోనున్నారు. అయితే వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. రాఖీ పండుగను ఎప్పుడూ కూడా భద్రకాలం లేని కాలంలోనే జరుపుకోవాలి. రక్షాబంధన్ ఆగస్టు 30 న మొదలవుతోంది . అయితే ఆ రోజున భద్రకాలం ఉంది. ఆగస్టు 30న రాత్రి 9:01 గంటలకు భద్రకాలం ముగుస్తుంది. అందువల్ల ఈ పండుగను ఆగస్ట్ 31న జరుపుకోవటం ఆమోదయోగ్యమైనదని పండితులు చెబుతున్నారు. భద్రకాలంలో సోదరీమణులు తమ సోదరుల చేతికి రాఖీ కట్టకూడదు. భద్ర కాలం ముగిసిన తర్వాతే రాఖీ కట్టాలి. ఈ నేపథ్యంలో ఆగస్టు 31 రోజున రాఖీ పండుగను జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు.