Site icon NTV Telugu

GVL Narasimha Rao: ప్రధాని రైల్వేలలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు..

Gvl Narasimha Rao

Gvl Narasimha Rao

GVL Narasimha Rao: ప్రధాని నరేంద్ర మోడీ రైల్వేలలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని రాజ్యసభ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు పేర్కొన్నారు. అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో ఆయన స్వాగతం పలికారు. రైల్వేస్టేషన్‌లో జీవితం ప్రారంభించిన ప్రధాని మోడీ రైల్వేల రూపురేఖలు మారుస్తున్నారని అన్నారు. మూడు వందేభారత్ ట్రైన్లు మన రాష్ర్టంలో సేవలందిస్తున్నాయని ఈ సందర్భంగా చెప్పారు.

Read Also: MP Margani Bharat: తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు.. అసంతృప్తి చెందే ఎమ్మెల్యేలకు ఎంపీ హితబోధ

అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ ఆగే 32 స్టాప్స్‌ ఏపీలోనే 14 ఉన్నాయన్నారు. పేదల కోసం నరేంద్ర మోడీ ఆలోచిస్తారన్నది మరోసారి రుజువైందన్నారు. రిజర్వేషన్ లేకుండా ప్రయాణించే వారికి, తక్కువ రుసుముతో అధునాతన సదుపాయాలు అందుబాటులో ఉంచారన్నారు. అమృత్‌ భారత్ అధునాతన సర్వీసులు ఇవ్వాలని ఉద్దేశంతో అమృత్‌ భారత్ ట్రైన్ సామాన్యులు, పేదలది అని ఎంపీ జీవీఎల్‌ నరసింహరావు వెల్లడించారు.

Exit mobile version