NTV Telugu Site icon

Raghav Chadha: కేజ్రీవాల్ తో రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా భేటి.. అసలేం చర్చించారు?

01

01

ఢిల్లీలో ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ సీఎం పీఏ విభవ్ కుమార్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో విభవ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఇంతకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేత రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తో భేటీ అయ్యారు. పార్టీలో రాఘవ్ కీలక నేత అన్న విషయం తెలిసిందే. ఆప్ లో పార్టీలో చేరిన ఆయన పార్టీలో అనేక ప్రధాన బాధ్యతలను నిర్వర్తించారు. కాగా.. ఆయన గత కొన్ని నెలలుగా బ్రిటన్‌లో ఉన్నారు. అక్కడ ఆయనకు కంటి శస్త్రచికిత్స జరిగింది. సీఎం కేజ్రీవాల్‌ అరెస్ట్‌ సమయంలో రాఘవ్‌ చద్దా ఇక్కడ లేరు. రాఘవ్ చద్దా గైర్హాజరుపై ప్రతిపక్షాలు ఆమ్ ఆద్మీ పార్టీపై నిరంతరం విమర్శలు గుప్పిస్తున్నాయి.

తాజాగా ఆయన బ్రిటన్ నుంచి వచ్చిన త్వరాత మొదటి సారి సీఎం ఇంటికి వచ్చారు చద్దా. ఆమ్ ఆద్మీ పార్టీలో గందరగోళం నెలకొన్న ప్రస్తుత తరుణంలో రాఘవ్ చద్దా విదేశాల నుంచి తిరిగి వచ్చారు. ఇటీవల రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ సీఎం పీఏ విభవ్ కుమార్‌పై తీవ్ర ఆరోపణలు చేయడంతో పాటు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతను తనను కొట్టారని, సీఎం సభలో దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. కాగా స్వాతి ఇదంతా బీజేపీ డైరెక్షన్‌లో చేస్తున్నారని ఆప్‌ నేతలు ఆరోపించారు. ఏం చర్చించారన్న అంశంపై ఇప్పటి వరకు సమాచారం లేదు.

Show comments