RajPal Yadav : తిహార్ జైలుకు స్టార్ కమెడియన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్లో తిరుగులేని కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న రాజ్‌పాల్ యాదవ్‌కు న్యాయస్థానంలో భారీ షాక్ తగిలింది. 2010లో ఆయన దర్శకత్వం వహించిన ‘అతా పతా లాపతా’ సినిమా ఆయనను ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తీసింది. ఈ సినిమా కోసం ఆయన చేసిన అప్పులే ఇప్పుడు ఆయన్ని కటకటాల వెనక్కి నెట్టాయి. సినిమా నిర్మాణం కోసం రాజ్‌పాల్ యాదవ్ ఢిల్లీకి చెందిన ‘మురళీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే సంస్థ నుండి రూ. 5 కోట్ల రుణం తీసుకున్నారు. అయితే, సినిమా ఆశించిన విజయం సాధించకపోవడంతో ఆ అప్పు తీర్చడం ఆయనకు భారంగా మారింది.
Also Read : Balayya : డాన్ గా బాలయ్య.. సోలో రిలీజ్ కోసం ప్లానింగ్
Also Read
- Tobacco Farmers: పొగాకు రైతులకు సర్కార్ గుడ్‌న్యూస్.. క్వింటాల్‌కు రూ.1,000 ప్రోత్సాహకం, వడ్డీలేని రుణాలు
- AP PPP Policy 2026కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. కీలక ఉత్తర్వులు జారీ
- Minister TG Bharath: మంత్రులపై నిఘా పెట్టేవారు.. నేరస్థులపై ఎందుకు పెట్టరు?: టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
ఈ క్రమంలో ఆయన ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడంతో సదరు సంస్థ కోర్టును ఆశ్రయించింది. వడ్డీలు, జరిమానాలతో కలిసి ఆ మొత్తం ఇప్పుడు రూ. 9 కోట్లకు చేరింది. చెక్ బౌన్స్ కేసులో 2018లోనే ఆయనకు 6 నెలల జైలు శిక్ష పడగా, అప్పటి నుండి ఆయన పైకోర్టుల్లో స్టే పొందుతూ వచ్చారు. అయితే, బాకీ చెల్లిస్తానని కోర్టుకు ఇచ్చిన హామీలను వరుసగా ఉల్లంఘించడంతో న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. ఫిబ్రవరి 4, 2026 నాటికి లొంగిపోవాలని కోర్టు ఆదేశించగా, మరికొంత సమయం కావాలని ఆయన చేసిన విన్నపాన్ని జస్టిస్ స్వర్ణ కాంత శర్మ తిరస్కరించారు. “చట్టం ముందు అందరూ సమానమే, సెలబ్రిటీల కోసం ప్రత్యేక నిబంధనలు సృష్టించలేం” అని కోర్టు స్పష్టం చేయడంతో ఆయన ఫిబ్రవరి 5న తిహార్ జైలు అధికారుల ముందు లొంగిపోయారు. జైలుకు వెళ్లే ముందు రాజ్‌పాల్ యాదవ్ అత్యంత భావోద్వేగానికి లోనయ్యారు. “సార్, నేను ఏం చేయాలి? నా దగ్గర పైసలు లేవు.. మరో దారి కనిపించడం లేదు. ఇక్కడ మేమంతా ఒంటరి వాళ్ళమే, ఎవరూ స్నేహితులు ఉండరు. ఈ సంక్షోభాన్ని నేను ఒక్కడినే ఎదుర్కోవాలి” అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. తెలుగులో రవితేజ నటించిన ‘కిక్ 2‘ వంటి సినిమాలతో ఇక్కడి ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైన రాజ్‌పాల్, ఇలాంటి పరిస్థితిలో ఉండటం అందరినీ కలిచివేస్తోంది.
తాజావార్తలు
-
Indraputra: హ్యాట్రిక్ హిట్ల తర్వాత ‘ఇంద్రపుత్ర’గా కిరణ్ అబ్బవరం.. పౌరాణిక ప్రపంచంలోకి గ్రాండ్ ఎంట్రీ!..
-
TPCC Chief Mahesh Kumar Goud: పుట్టుకతో చక్రవర్తులు అవుతారు.. కానీ పాపన్న పోరాడి రాజయ్యాడు..
-
Tobacco Farmers: పొగాకు రైతులకు సర్కార్ గుడ్‌న్యూస్.. క్వింటాల్‌కు రూ.1,000 ప్రోత్సాహకం, వడ్డీలేని రుణాలు
-
KTM RC 160 Price Hiked: KTM RC 160 ధర పెంపు.. ఇప్పుడు ఎంతంటే? కొత్త ధర, ఇంజిన్, ఫీచర్ల పూర్తి వివరాలు
-
Lopamudra Raut Theft Case: బిగ్‌బాస్ ఫేమ్ ఇంట్లో భారీ చోరీ.. నిందితుడి అరెస్ట్, రూ.76 లక్షల సొత్తు స్వాధీనం!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!