Coolie : సూపర్ స్టార్ రజనీకాంత్ “జైలర్” సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు.జైలర్ మూవీతో రజనీకాంత్ తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.ఆ సినిమా తరువాత రజనీకాంత్ తన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ తెరకెక్కించిన “లాల్ సలాం” సినిమాలో గెస్ట్ పాత్రలో నటించారు.కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు.ఈ సినిమా తరువాత తలైవా వరుస సినిమాలను లైన్ లో పెట్టారు.వాటిలో “కూలీ” మూవీ ఒకటి.కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమా తలైవా 171 వ మూవీ గా తెరకెక్కుతుంది.
Read Also :Shankar :ఆ కోలీవుడ్ స్టార్ హీరోతో మూవీ చేయనున్న శంకర్..?
ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో పాపులర్ యాక్టర్ సత్య రాజ్ రజనీకాంత్ స్నేహితుడిగా కనిపించబోతున్నాడు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అప్డేట్ బాగా వైరల్ అవుతుంది.ఈ సినిమా ఫస్ట్ షూటింగ్ షెడ్యూల్ లోకేష్ కానగరాజ్ టీం చెన్నై ,హైదరాబాద్ లలో ప్లాన్ చేసింది.ప్రస్తుతం జరిగే ఈ షెడ్యూల్ లో రజనీకాంత్ ,సత్యరాజ్ ,శృతి హాసన్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.గోల్డ్ అక్రమ రవాణా నేపథ్యంలో సాగె ఈ కథలో రజనీకాంత్ స్మగ్లర్ గా కనిపించనున్నాడు.రీసెంట్ గా ఈ చిత్రం నుండి మేకర్స్ రిలీజ్ చేసిన టైటిల్ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
Exclusive : Coolie Shooting Update
– The first phase of #Rajinikanth's "#Coolie" is planned to be shot in Chennai and Hyderabad.✔️
– This shoot has scenes involving Rajini and #ShrutiHaasan & #Sathyaraj.✍️
– The shooting of the film will begin this month.🥂#Vettaiyan #Jailer2… pic.twitter.com/FfKi88D9kg— Movie Tamil (@MovieTamil4) June 6, 2024