Rajnath Singh: నేడు విశాఖపట్నంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన రెండు యుద్ధ నౌకలను దేశానికి అంకితం చేశారు. దీనితో విశాఖపట్నంలోని తూర్పు నావికాదళ శక్తి మరింతగా పెరిగింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఐఎన్ఎస్ హిమగిరి, ఐఎన్ఎస్ ఉదయగిరి అనే రెండు యుద్ధ నౌకలను దేశానికి అంకితం చేశారు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ నౌకలు భారత సాంకేతిక సామర్ధ్యానికి ప్రతీకగా నిలవనున్నాయి.
Ganesh Idol Trunk: గణపయ్య విగ్రహంలో తొండం ఎటు వైపు ఉండాలంటే.. కుడి వైపా? ఎడమ వైపా?
ఇండో-పసిఫిక్ ప్రాంతం, చైనా సరిహద్దులలో వ్యూహాత్మక రక్షణలో ఈ రెండు నౌకలు కీలక పాత్ర పోషించనున్నాయి. అత్యాధునిక కమ్యూనికేషన్ వ్యవస్థలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వీటిని నిర్మించడం దేశ రక్షణలో మరో మైలురాయిగా నిలవనున్నాయి. ఆత్మనిర్భర్ భారత్ సిద్ధాంతానికి నిదర్శనంగా, మన దేశీయ MSME రంగం సాంకేతిక ప్రతిభ ఈ నౌకల్లో ప్రతిబింబిస్తోంది.
రక్షణ శాఖ లక్ష్యాల ప్రకారం 2050 నాటికి 200 యుద్ధనౌకలను నిర్మించాలనే ప్రణాళిక ఉందని, ఇది భారత నావికాదళ శక్తిని ప్రపంచ వేదికపై మరింత బలోపేతం చేస్తుందని మంత్రి అన్నారు. హిందూ మహాసముద్రంలో ఆధిపత్య పోరు ఉన్నా, భారత్ మాత్రం “వసుధైక కుటుంబకం” అనే సూత్రాన్నే తన సిద్ధాంతంగా కొనసాగిస్తుందని రక్షణ మంత్రి స్పష్టం చేశారు. ఇక ఇటీవల జరిగిన పహల్గాం దాడిపై తీవ్రంగా స్పందించిన రాజ్నాథ్ సింగ్, దానికి ప్రతిస్పందనగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ త్రివిధ దళాల పాటవానికి నిదర్శనమని పేర్కొన్నారు.
ఈ టీవీ ధరకు SVU కారు కొనొచ్చు కాదయ్యా.. Hisense UX ULED సిరీస్ టీవీలు లాంచ్!
ఈ ఆపరేషన్ ముగియలేదని, ఇంకా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. తక్కువ సమయంలోనే త్రివిధ దళాలు ఆపరేషన్ కోసం సిద్ధం కావడం జాతి మొత్తం గుర్తుంచుకుంటుందని తెలిపారు. ప్రధాని నేతృత్వంలో భారత రక్షణ దళాలు మరింత బలోపేతం అవుతున్నాయని, పరిశోధన, ఆవిష్కరణలు, సాంకేతికత, కార్యాచరణలతో దేశ భద్రతా వ్యవస్థ మరింతగా దృఢం అవుతుందని రక్షణ మంత్రి పేర్కొన్నారు.