Site icon NTV Telugu

‘Varaanasi’: ‘వారణాసి’లో చిన్న మహేశ్‌గా స్టార్ హీరో కొడుకు ఎంట్రీ..

Varanasi (2)

Varanasi (2)

టాలీవుడ్‌లో వరుస ఫ్లాప్స్‌తో ఇబ్బందులు పడుతున్న సుధీర్ బాబు ఇప్పుడు తన కొత్త సినిమాల పై ఫోకస్ పెంచాడు. అయితే ఇప్పుడు అతడి కంటే ఎక్కువగా  ఆయన కొడుకు దర్శన్ పేరు గట్టిగా వినపడుతుంది. ఇప్పటికే రెండు సినిమాల్లో బాల నటుడిగా కనిపించిన దర్శన్, మంచి స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఇండస్ట్రీ వాళ్ల దృష్టిని ఆకర్షించాడు. ఇప్పటికే భారీ ప్రాజెక్ట్ ‘ఫౌజీ’లో ప్రభాస్ చిన్నప్పటి పాత్రను పోషించిన దర్శన్‌కు ఆ పాత్ర మంచి అప్రిసియేషన్ తెచ్చిపెట్టిందట. దీంతో తాజాగా ఎస్ ఎస్ రాజమౌళి – మహేశ్ బాబు కాంబోలో వస్తున్న ‘వారణాసి’ లో.. కూడా

Also Read : Varanasi: ఆ హీరో ఫైనల్ అయ్యారా..? ‘వారణాసి’ హనుమంతుడి పాత్ర పై హాట్ టాక్!

చిన్న మహేష్ బాబు పాత్రకు దర్శన్‌ను ఫిక్స్ చేశారు. ఇన్‌సైడ్ సమాచారం ప్రకారం, ‘వారణాసి’ టీమ్ బాల్య సన్నివేశాల షూట్‌ను త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నారు.  ఈ పాత్రకు ఎక్కువ మంది అభిమానులు గౌతమ్‌ (మహేశ్ బాబు కొడుకు)నే ఆశించిన, ఇప్పుడు అతని వయసు ఆ పాత్రకు సరిపోకపోవడంతో పాటు, షూట్‌కు కూడా పూర్తిగా అందుబాటులో లేడని టాక్. దీనితో ఆ పాత్రకు దర్శన్ బెస్ట్ ఆప్షన్‌గా కనిపిస్తున్నాడట. ముఖ్యంగా అతడి హెయిర్‌స్టైల్, ఫేస్‌స్ట్రక్చర్ మహేశ్ చిన్ననాటి లుక్‌కు దగ్గరగా ఉండటం ఈ నిర్ణయానికి ముఖ్య కారణం. ఇక రాజమౌళి సినిమాలో చిన్న మహేష్‌గా కనిపిస్తే, అతడి కెరీర్‌కు ఇది డబుల్ బూస్ట్ అవుతుందని ఇండస్ట్రీ అంతా అంటోంది. మరికొంతమంది మాత్రం, “మామా-అల్లుడు కాంబినేషన్ స్క్రీన్ మీద కూడా బాగా వర్క్ అవుతుందని అంటూన్నారు.

Exit mobile version