NTV Telugu Site icon

Rajinikanth’s Jailer: రజినీతో అట్లుంటది మరి.. ఉద్యోగుల కోసం 7 స్క్రీన్స్ బుక్ చేసిన సీఈఓ!

Rajinikanth Jailer

Rajinikanth Jailer

Freshworks Company CEO Girish Booked 2200 Tickets for Rajinikanth’s Jailer Movie: ప్రపంచవ్యాప్తంగా ‘సూపర్ స్టార్’ రజినీకాంత్‌కి ఉన్న ఫ్యాన్ పాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తమిళనాడులో అయితే ‘తలైవా’ పిచ్చి పీక్స్‌లో ఉంటుంది. ప్రతి ఒక్కరు రజినీ సినిమా ఎప్పుడొస్తుందా? అని ఎదురుచూస్తుంటారు. రిలీజ్‌కు ముందు ఫాన్స్ హడావిడి మాములుగా ఉండదు. రజినీ సినిమాను రిలీజ్ రోజే తప్పకుండా చూడాలని టికెట్స్ ముందే బుక్ చేసుకుంటారు. అయితే ఫాన్స్ టికెట్స్ ముందే బుక్ చేసుకోవడం సాధారణ విషయం అయినప్పటికీ.. ఓ కంపెనీ సీఈఓ తన ఉద్యోగుల కోసం ఏకంగా 7 స్క్రీన్స్ బుక్ చేయడం విశేషం.

తలైవా రజనీకాంత్‌ నటించిన తాజా చిత్రం ‘జైలర్‌’. మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ వంటి స్టార్లు నటించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జైలర్‌ సినిమా కోసం ఫ్రెష్‌వర్క్స్ కంపెనీ ఫౌండర్, సీఈఓ గిరీష్ మాతృభూతం తమ కంపెనీలో పనిచేసే 2200 మంది ఉద్యోగుల కోసం స్పెషల్ షోలు వేయిస్తున్నారు. ఇందుకోసం ఏకంగా ఏడు స్క్రీన్స్ బుక్ చేశారు. ఈ విషయ్నాని అతనే స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడించారు. ‘ఫ్రెష్‌వర్క్స్ ఉద్యోగుల కోసమే 2200 టిక్కెట్స్, 7 స్క్రీన్లు’ అని గిరీష్ పేర్కొన్నారు. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది.

Also Read: AP BJP: పంచాయితీ నిధుల కోసం కలెక్టరేట్ల ముట్టడికి బీజేపీ పిలుపు

ఫ్రెష్‌వర్క్స్ కంపెనీ చెన్నై, బెంగళూరు మరియు హైదరాబాద్ కేంద్రాలుగా పని చేస్తోంది. ఫ్రెష్‌వర్క్స్ సంస్థ సీఈఓ గిరీష్ మాతృభూతం..
సూపర్ స్టార్ రజినీకాంత్‌కి వీరాభిమాని. అందుకే రిలీజ్ రోజునే తమ ఉద్యోగులకు జైలర్ సినిమా చూపించాలని నిర్ణయించుకున్నారు. దాంతో 7 స్క్రీన్లలో 2200 టిక్కెట్స్ బుక్ చేశారు. ఫ్రెష్‌వర్క్స్ సీఈఓ ఇలా టికెట్స్ బుక్ చేయడం ఇదే మొదటిసారి కాదు. కబాలి రిలీజ్ సమయంలో చెన్నైలో ఓ థియేటర్ బుక్ చేశారు. కొచ్చాడియన్, లింగా, ఎంతిరన్ సినిమాలకు కూడా ఆయన టికెట్స్ బుక్ చేశారు. ప్రస్తుతం ఫ్రెష్‌వర్క్స్ సీఈఓ గిరీష్ మాతృభూతం పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతుంది.